పురుషులు చేసే పెద్ద తప్పిదమంటే బెడ్ లో తమ మాజీ ల గురించి మాట్లాడటమే...లేదా పోల్చడమే. పురుషులకు భావప్రాప్తి కలిగినంత త్వరగా మహిళలకు కలగదనే విషయాన్ని పురుషులు గ్రహించాలి. అందులోనూ, ఇటువంటి విషయం మాట్లాడితే...పడక వరకే కాదు, ఇక రోజంతా మీ పని ఖాళీయే. తమను గాఢంగా ప్రేమించే పురుషుడితోనే మహిళలు దగ్గరవుతారు. మరొకరిలా చూస్తే మిమ్మల్ని మరచిపోయే ప్రమాదం కూడా వుంది. టైమ్ పాస్ కొరకైనా సరే మాజీలగురించి చెపితే, తమను సీరియస్ గా తీసుకోవడంలేదని వారు భావిస్తారు.
పురుషులు కొత్త జీవితాన్ని మొదలెట్టాలనుకుంటే వారి ప్రేమ వినూత్నంగా వుండాలి. భాగస్వామికి ఎంతో సౌకర్యాన్నిచ్చేదిగాను, ప్రత్యేకంగాను వుండాలి. మహిళ తన పురుషుడితో పూర్తిగా అర్ధం చేసుకుంటే, అతను తన గతాన్నించి బయటకు వచ్చేలా చేయగలదు. పురుషులు తాము గతంలో ప్రేమించిన యువతి వేరే పురుషుడితో ఆనందంగా వుంటుందన్న విషయం భావించరు. మొదటి మహిళతో ఎంత ఉత్సాహంగా వున్నారో అంతే ఉత్సాహంగా వుండాలని కూడా భావించాలి. అలా భావిస్తేనే ప్రస్తుత జీవితం ఆనందంగా వుంటుంది.
మహిళలు పురుషులపై సందేహిస్తూనే వుంటారు. ఇక పురుషులు కనుక తరచుగా మాజీల ఊసెత్తితే, తమను వారివలే ఊహించుకుంటున్నట్లుగా కూడా భావిస్తారు. గతాన్ని ఆలోచిస్తూ నిస్సారంగా జీవితాన్ని సాగించే మహిళ మీకు అందించేది బ్లాక్ అండ్ వైట్ సినిమాయే కాని రంగుల సినిమా గా వుండదన్నది పురుషులు గుర్తుంచుకోవాలి. కనుక పురుషులు తమ నోటికి గట్టి తాళం వేసుకొని ప్రస్తుత జీవన భాగస్వామితో సంచరించాలి.
మీ మాజీ ప్రియురాలు...ఇక మాజీయే నన్న విషయం గ్రహించండి. గతాన్ని తుడిచేసి మరోమారు మీ భవిష్యత్తులోకి వస్తుందని ఆశించకండి. రెడీగా పడకలో వున్న యువతి ఆ క్షణంలో మీకు ఆనందాన్ని అందించగలదని గ్రహించండి.