స్వయం ప్రేరణ, హస్త మైధునాలపై గల అపోహలు...
1. మగ పిల్లలు స్వయం మైధునం చేసుకుంటే నపుంసకత్వమే: ఇది ఒక అపోహ మాత్రమే. పిల్లలను భయపెట్టేందుకు చెప్పిన మాయమాటలు. వయసులో వున్న వారికి నపుంసకత్వం ఎలా వస్తుంది? హస్తమైధునంలో బయటకు పోయిన వీర్యం మరల 2 గంటల్లో భర్తీ అవుతుంది. కనుక నపుంసకత్వం వస్తుందనే దానికి సైంటిఫిక్ నిరూపణ లేదు.
2. హస్తమైధునం చేస్తే వీర్యం త్వరగా పడిపోతుంది: అంగస్తంభన సమస్య వున్న వారికి హస్తమైధునం చేస్తే త్వరగా వీర్యం రిలీజ్ అవుతుంది. భాగస్వామి అసంతృప్తి భావిస్తుంది. కాని సాధారణ ఆరోగ్యం కల పురుషులకు పడకలో ప్రేరణ చాలా సమయం తీసుకుంటుంది. ప్రతి నిమిషం ఆనందిస్తారు. కనుక ముందస్తుగా వీర్యం పోవటం లేదా శ్రీఘ్ర స్కలనం వంటివి హస్తమైధునం చేస్తే రావు.
3. యువతులు హస్తమైధునం చేస్తే కన్నెత్వం పోతుంది: ఇది మరొక అపోహ మాత్రమే. భయం కొరకు చెప్పబడిందే కాని, వాస్తవం కాదు. స్వయం మైధునం చేసుకుంటే బాలికకు కన్నెత్వం పోదు. చాలా కేసులలో ఇది అసాధ్యం కూడాను. యువతుల అంగాలను ప్రేరేపించటానికి అంగప్రవేశమే అవసరం లేదు. యువతులు తమంతట తాము స్వయం మైధునం చేసుకొని ఆనందం పొందగలరు. ఈ చర్యకు వారిలోని కన్నెపొర పోవటమనేది అసాధ్యమే.
4. హస్త మైధునంలో ఇన్ ఫెక్షన్ వస్తుంది : మురికిపట్టిన చేతులతో చేస్తే వస్తుంది. మురికి చేతులతో తింటే పొట్ట కూడా వ్యాధులకుగురవుతుంది. కనుక స్వయం ఆనందంలో కూడా, తినటం, నిద్రించటం వంటి వాటిలో వలెనే వ్యక్తిగత శుభ్రత ప్రధానం. ఇక్కడ శుభ్రత కావాలి కాని హస్త మైధునం అనారోగ్యం కలిగించదు.
5. వివాహమైన వ్యక్తులు స్వయం మైధునం చేసుకోరు: చేయరాదని అటువంటి గట్టి నిబంధన లేదు. ఇది జంటల రతి చర్యలకు ఏ మాత్రం అడ్డుకాదు. భాగస్వామి తో చేసే రతి తృప్తి కలిగించకపోతే, అతడు లేదా ఆమె స్వయంగా రతి చేసుకోవటంలో హాని ఏమీ లేదు. అది వారికి తృప్తి నిచ్చినంత కాలం చేసుకోవచ్చు. వివాహమైనవారు కలసి రతి చేయటం లేదా ఎవరికి వారే స్వయంగా చేసుకోవటం సాధారణం.
కనుక స్వయం రతిపై మీకు గల అపోహలు పై విధంగా తొలగించుకోండి. ఎందుకంటే మీరనుకునేవి వాస్తవాలు కాదు. అయితే, ఏదైనప్పటికి అతిగా చేస్తే ప్రమాదకరమే. అదే రకంగా స్వయం ప్రేరణ కూడా అతిగా చేసుకుంటే ఆనందం అంతరిస్తుంది.