•  

ప్రేమను తెలుపాలంటే ...అది ఒకటే మార్గమా?

Is Lovemaking The Only Way To Show Love?
 
వివాహమయిన తర్వాత జీవితం కష్టమే. భాధ్యతలెన్నో వచ్చి పడతాయి. ఇక ఆసమయంలో భార్యా భర్తలు పాటలు పాడుకుంటూ పార్కుల వెంట తిరగలేరు. అది వారికి తిండిపెట్టదు. పురుషులైతే సంపాదించటం, స్త్రీలైతే ఇల్లు చక్క దిద్దటం చేయాలి. ఇక వీటితో, భార్యా భర్తల మధ్యగల ప్రేమ హృదయాల్లోనే అట్టడుగుపొరల్లో వుండిపోతుంది. కాని, జీవితం చాలా చిన్నది. ప్రేమ అందులో ఒక భాగం మాత్రమే. కనుక ఆ ప్రేమను వ్యక్తపరచాలంటే శారీరక స్పర్శలకంటే మించింది ఏముంటుంది? భార్యాభర్తలు చట్టబద్ధమయ్యారు. కనుక ప్రేమించటం వారికి ప్రతిరోజూ వుండాల్సిందే.

వివాహం జరిగితే పురుషుడు, స్త్రీ ఇరువురు ఒకరికొకరని తెలిసిందే కనుక ప్రేమ ఎపుడైనా కావచ్చు. శారీరక ఆకర్షణలు లేదా మనో భావాల మార్పులు ప్రణాళిక చేయాల్సిన అవసరం లేదు. ఇవి అప్పటికపుడు తెలియకుండా కూడా జరుగుతాయి. టివి లో వచ్చే ఒక హాట్ సీన్ జంటలకు కోరిక కలిగించవచ్చు. ఇంట్లో పిల్లులు పోరాడితే అదే వారి కోరికలకు ప్రేరకం కావచ్చు. పెళ్ళి తర్వాత ప్రేమ ఎపుడు కావాలంటే అపుడే ప్రదర్శించవచ్చు. ఇతర పనులు సైతం పక్కన పెట్టేయవచ్చు. పురుషులు ఇంటిలో వున్నపుడు దుస్తులు కూడా సరిగా ధరించరు. ఇక మహిళలు నైట్ గౌన్ల కొరకు సొమ్ము వెచ్చిస్తారు. మహిళలు భర్తలకు మరింత ఆనందం ఎలా కలిగించాలా? అనేదానికి ప్రయత్నిస్తుంటారు. మంచి రుచికరమైన వంటకాలు చేసి పెట్టడం, సమయం చూసి రెచ్చిపోయేందుకు వారి శరీరం, తల మర్దనలు చేయటం వంటివి కూడా చేస్తారు. ఇక వారు మంచి వసనవచ్చే సెంట్లు, పూలు మొదలైనవి కూడా ధరిస్తారు.

పెళ్ళి అయిన తర్వాత గతంలోవలే, గ్రీటింగ్ కార్డులు ఇచ్చుకోడం లేదా స్వీట్లు పెట్టుకోవడం వంటివి అవసరం లేదు. ప్రేమను వ్యక్త పరచటంలో కొత్త టెక్నిక్ లు ఆచరిస్తారు. మరింత సంతృప్తి, ఆనందాల కొరకు కొత్త భంగిమలు, ట్రిక్కులు, ఐడియాలు కనిపెడతారు. లేదంటే సువాసన భరితమైన కండోమ్ లు లేదా వయాగ్రా టాబ్ లెట్లు కూడా ఇచ్చుకుంటూ ఒకరికొకరు ప్రోత్సహించుకోవాలి. వివాహమైన వారు రతిక్రీడను తమ ప్రేమను ప్రదర్శించటానికి చేసే చర్యగానే వుండాలి గాని ఒక పనిగా భావించరాదు. జంటలు ఒకరికొకరుగా ఆనందించినంత కాలం అనుబంధం గట్టిగానే వుంటుంది అవగాహన కూడా అధికంగా నే వుంటుంది కనుక రతిక్రీడ అనేది పెళ్ళి అయిన తర్వాత ప్రేమను ప్రదర్శించటానికి అనువైన ఒక మంచి మార్గం.

English summary
Life after marriage is a little serious as responsibilities start from the day one. During that time, couples cannot run behind the bushes and sing songs as that will not make their meal. Men need to get focus about career and women need to plan to be good homemakers. With this learning process, love is tightly wrapped in the heart as the couple feel that there is still time to share feelings.
Story first published: Saturday, October 22, 2011, 14:07 [IST]

Get Notifications from Telugu Indiansutras