రతిక్రీడ అనేది స్త్రీ, పురుషుడు తమ భావాలను వ్యక్తం చేసుకునేటటువంటి కళ. అది చక్కగా వ్యక్తంచేయాలంటే రంగులు కావాలి. రంగులు ఎక్కడనుండి వస్తాయి? గదిలోని బెడ్స్ పై వేయబడిన బెడ్ షీట్లు, లేదా వారు ధరించిన దుస్తులు లేదా అక్కడ వెలిగే లైట్లనుండి వస్తాయి. వీటినన్నింటినీ చూసిన జంటలు తమ కోర్కెలకు పదును పెడతారు.
ఈ సమయంలో లైట్ల వెలుగులు ప్రధాన పాత్రే వహిస్తాయి. అవి జంటలకు అన్నింటిని రంగుల్లో చూపిస్తాయి. అయితే అవి ఎంత వెలుగు వుండాలనేది వారు నిర్ణయించుకోవాలి. గొడల రంగులు, బెడ్ రంగులు ఎప్పటికపుడు మార్చుకుంటూ వుండచ్చు.
ఏ రంగు లైట్ వేస్తే...ఏం జరుగుతుందనేది చూద్దాం!
ఎరుపు రంగు లైట్లు - వేడెక్కిస్తాయి. ఈ రంగు చూస్తే హార్మోన్ల స్ధాయి పెరుగుతుంది. జంటలు బాగా రెచ్చిపోయే దశ వస్తుంది.
పసుపురంగు లైట్లు - జంటలు వెచ్చటి హాయి అన్న భావనలు పొందుతారు. శరీర ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. పురాతన కామసూత్ర చరిత్రలో నూనెతో వెలిగించిన దీపాల పసుపు కాంతులు అద్భుతమైన కామసూత్ర భంగిమలను ప్రదర్శించాయి. ఇప్పటికి నేటి రోజుల ఎల్ ఇ ఢి టెక్నాలజీ వచ్చినప్పటికి నూనె దీపాల ప్రాధాన్యత గ్రహించిన దేవాలయాలు వాటిని మాత్రమే అమలు చేస్తున్నారు.
గ్రీన్ లైట్లు - రతిక్రీడకు బాగా పనిచేస్తాయి. జంటలు ఒకరిపై ఒకరు బాగా ఇష్టపడతారు. డల్ అనిపించే ఈ రంగు వారిని మరోలోకంలో వున్నట్లు భావింపజేస్తాయి. స్త్రీ, పురుషులు ఈ కాంతిలో వేడెక్కించే సన్నివేశాలు అమలు చేస్తారు.
గదిలో నీలం రంగు బల్బులు పెడితే....ఏదో ఒక పబ్ లో వున్నట్లు గడుపుతారు. బయట వర్షం కూడా పడితే ఇక చీకటే. దట్టమైన నీలం అంటే డార్క్ బ్లూ లైట్ పెడితే సూర్యడు ఉదయించినా, గదిలో పరిస్ధితి మారదు.
రంభ లాంటి అందగత్తె ఆరబోసే అందాలను ఆనందించాలంటే గదిలో వెలుగులు విరజిమ్మాల్సిందే. చీకటిలో అన్నీ ఒకే రకంగా కనపడతాయి. ఒకరంటే ఒకరికిగల ఇష్టాలు సైతం పక్కదోవ పడతాయి. కనుక మధుర స్మృతులు నిలిచిపోవాలంటే విరజిమ్మే వెలుగులు కాకపోయినా, మత్తెక్కించే డిమ్ లైట్స్ ఆన్ చేయండి...ఆనందించండి.