అసలు వివాహమైన తర్వాత ఎంత వరకు వివాహ వ్యవస్ధకు గౌరవమివ్వాలనేది తెలుసుకుంటే ఈ వివాహేతర ఆకర్షణల సమస్యలుండవు. వివాహ వ్యవస్ధ మరింత పటిష్టమవుతుంది. ఇటువంటి పరిస్ధితులలో మీరు చేయాల్సింది రెండే రెండు పనులు ...ఒకటి మీ భాగస్వామితో విడాకులు పొందటం కొత్త సంబంధం కొనసాగించటం లేదా మీరు సంబంధం కొనసాగించి, దానిపై గల ఆకర్షణ మరచిపోయి వివాహబంధంలో కొనసాగటం.
మీ భాగస్వామితో కొనసాగాలనుకునేవారికి కొన్ని సూచనలిస్తున్నాం ...పరిశీలించండి. మీరు పొందే ఆకర్షణకు మీ భాగస్వామి క్షమించి వదిలేయగలగాలి. అపుడే మీరు కొత్త ఎఫైర్ లో కొనసాగగలుగుతారు. మొదట, మీరు సంబంధిత వ్యక్తికి ఆకర్షితమయ్యానని మీ భాగస్వామికి చెప్పండి. అందులోని లోటుపాట్లు ఇద్దరూ చర్చించుకోండి. దానికి గనుక ఇరువురకు పరిష్కారం కుదిరితే మంచిదే. దానికి గాను మీ భాగస్వామి చక్కగా వినేవారై వుండాలి. ఎందుకంటే ఈ పరిస్ధితి చాలా సున్నితమైంది. ఏ మాత్రం తప్పుడు అవగాహన కలిగినా సంబంధం తెగిపోయే ప్రమాదం వుంది.
ఇక తర్వాత మీరు చేయాల్సింది. మీరు ఆకర్షించిన వ్యక్తి తో ఎంతవరకు మీరు ప్రొసీడ్ అవ్వాలనేది నిర్ణయించుకోండి. భవిష్యత్తులో మరింత ముందుకు పోకుండా జాగ్రత్త పడండి. ఇది ఇద్దరికి చాలా ప్రమాదకరం. గత తప్పిదాలనుండి పాఠాలు నేర్చుకోండి. లేదూ మీ పాత భాగస్వామిని బాగా ఇష్టపడుతున్నానంటే...అటువంటి పరిస్ధితులున్నపుడు ఆమెను లేదా అతడినే గౌరవించి వివాహ విలువలతో కొనసాగండి.
ఇంత వరకు జరిగిన తర్వాత కూడా మీరు ఆకర్షణకే లోనవుతున్నారంటే...ఇక మీరు మీ భాగస్వామికి ఏ కారణాల వలన ఆ ఆకర్షణను మరచిపోలేకపోతున్నారో వివరించి, వినటానికి ఎంత కష్టమైనప్పటికి వాస్తవాలను వివరించి ఆకర్షించిన వారివైపు మొగ్గండి.