మహిళ సెక్స్ జీవితానికి సంబంధించి ఆమెకుగల సంబంధాలు ప్రధాన కారణంగా వుంటాయి. మరో కారణం మహిళలలో హర్మోన్ల స్ధాయి. కనుక మహిళలకు సెక్స్ వాంఛ అధికం చేయాలంటే, మందులతో వైద్యం చేసేముందుమానసిక భావాల విశ్లేషణ ఎంతో అవసరమని నిపుణులు చెపుతున్నారు.ఇదే అంశం ఆధారంగా మిస్సోరీ యూనివర్శిటీ లోని లారీ మింజ్ ఒక పుస్తకం కూడా రాసింది. ఆమె తన పుస్తకంలో ఆరు స్ధాయిల మానసిక వైద్యాన్ని సూచించింది. అందుకుగాను వీలైనంతవరకు పురుషుడు చొరవ చూపాలని సూచించింది.
నులి వెచ్చని వేడినీటి స్నానం, ఆపైన ఆకర్షణీయమైన ఒక లుంగీ కట్టేస్తే.....మీ భార్యకు మీ మనసేంటో వెంటనే తెలిసిపోతుంది. అటు బాత్ రూమ్ లోను, ఇటు పడక గది లోను సువాసనలు వెదజల్లే కేండిల్స్ లేదా ఇతర సువాసనా ద్రవ్యాలు పెట్టెయ్యండి. ఇక ఆ ప్రత్యేకతలకు మీ భార్య......రొమాన్స్ చేసేయటానికి అనుమతినిచ్చినట్లే. భర్తలు కూడా వారి భార్యల దగ్గర బట్టలూడదీసే స్ట్రిపింగ్ పనులు చేయవచ్చు. వారు కూర్చున్న మంచం లేదా మేట్రస్ వారి ప్రదర్శనకు ఒక స్టేజ్ కాగా వేడెక్కించే దృశ్యాలు చూపుతూ అదరగొట్టే మ్యూజిక్ పెట్టేయండి. భార్యను పడేసుకోవాలంటే మంచి మార్గమల్లా ఆమెను మీవైపు లాగి డ్యాన్స్ చేయించటమే. సహజంగా సంతోషాన్ని అధికం చేసే చాక్ లెట్లు, డ్రై నట్స్, లేదా స్వీట్స్ మొదలైనవి తగిన శక్తినిచ్చి ఆమె 'ఓ కే' అనేసేలా దోహదపడతాయి. భార్యను అందుకు ఒప్పించేటపుడు సూటిగా ఆమె కళ్ళలోకే చూడండి. నవ్వవద్దు. సీను పలచబడిపోతుంది. ఆ కళ్ళలోంచి మీ భావాలు ఆమెకు తెలియాలి. ఈ అవకాశం జారిందంటే ఇక ఎప్పటికి మధురక్షణాలు చేయి జారిపోతాయని ఆమె భయపడాలి.
ట్రీట్ మెంట్ లో భాగంగా సెక్స్ ఆలోచనల స్టడీపై కూడా ఆమె కొన్ని ఛాప్టర్లు రాసింది. భాగస్వామితో ఎలా మాట్లాడాలి, కలసి సమయం ఎలా గడపాలి, ఒకరినొకరు ఉద్రేకం కలిగించే సమయంలో ఎలా టచ్ చేయాలి. ఇతర సమయాలలో ఎలా టచ్ చేయాలి. సెక్స్ కు సమయం ఎలా పొందాలి? లైంగిక చర్యలు మరింత ఆసక్తికరంగా వుండేలా ఎన్ని విధాలుగా చేయవచ్చు? అనే అంశాలు వివరించింది. ఈ పుస్తకం మహిళల సెక్సు వాంఛను అధికం చేసేదిలా వుంది. మహిళల సెక్సు వాంఛలు అధికం చేయటానికి మానసిక కారణాలు అధికంగా వుంటాయని, వీటిని పరిష్కరించకుండా మందులు వాడటం వలన ప్రయోజనం లేదని వివరించింది.
మింజ్ తన పరిశోధనా ఫలితాలను అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ సెక్సువాలిటీ ఎడ్యుకేటర్స్, కౌన్సెలర్స్ అండ్ ధిరపిస్ట్ వార్షిక సదస్సులో కూడా ప్రజంట్ చేస్తోంది. ఈ స్టడీని జర్నల్ ఆఫ్ సెక్సువల్ మెడిసిన్ లో కూడా ప్రచురించారు.