•  

అంగం చిన్నదైతే..!! సుఖ పెట్టలేరా..?

Male Sex Stamina
 
''అంగం చిన్నదైతే భాగస్వామిని సుఖ పెట్టలేమా''..? అధిక శాతం మంది మగవారిలో మొదులుతున్న ప్రశ్న ఇదే.. యువ్వనం నుంచి పెళ్లిలోకి అడుగుపెట్టి దాంపత్య జీవితాన్ని అనుభవిస్తున్న వారిలో దాదాపు 90 శాతం మంది తమ 'అంగ సామర్థ్యం' పై అనుమానాలు వ్యక్తం చేస్తున్న వారే. వీరు లైంగికంగా సంతృప్తిని పొందుతున్నా.. ఏదో మిస్సవుతున్నామన్న మానసిక వేదనకు గురువుతున్నారు.

నా పురుషాంగం సన్నగా ఉంది.., నా అంగం పొట్టిగా ఉంది, పక్కవాడిది పెద్దదిగా ఉందన్న అపోహలు ముఖ్యంగా యువతను పట్టి పీడుస్తున్నాయి. ఈ అభిప్రాయం నిజంగా అత్యాశ వంటిదని సెక్సాలజిస్టులు పదే పదే చెబుతున్నారు. ఉన్నంతలోనే తృప్తి పడదాం అన్న భావనను తమలో పెంచుకోవాలని వీరు సూచిస్తున్నారు.

ఈ విషయానికి సంబంధించి, ఇటీవల పలువురు సెక్సాలజిస్టులు నిర్వహించిన సర్వేలో కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాధారణ సమయాల్లో 3 నుంచి 4 అంగుళాల పరిమాణంలో ఉండే పురుషాంగం, కామోధ్రేకానికి గురైన సమయంలో 5 - 6 అంగుళాలు, అంతకన్నా పై స్థాయికి వ్యాప్తి చెందుతుందట. వాతావరణాన్ని బట్టి అంగ పరిమాణంలో మార్పులు చోటుచేసుకుంటాయని వీరి అధ్యయనం వెల్లడిస్తుంది.

పురుషాంగం 'పెద్దదా, చిన్నదా' అన్నది సమస్యకాదు, స్తంభించగల సత్తా ఉందా లేదా అన్నది ముఖ్యం. రతిలో భాగస్వామిని సుఖపెట్టటానికి కావల్సింది 'సెక్స్ సామర్ధ్యం'.

English summary
Sexual stamina is important to men who want to fully please their lovers. Unfortunately, many men suffer from a lack of stamina due to premature ejaculation or other problems.
Story first published: Friday, September 2, 2011, 15:11 [IST]

Get Notifications from Telugu Indiansutras