•  

పెళ్లి తర్వాత ముద్దంటే చేదవుతుందా?

Why some stop kissing after Marriage?
 
ము... ము... ముద్దంటే చేదా, నీకా ఉద్దేశం లేదా అని ఓ హీరోగారు హొయలు పోతున్న హీరోయిన్‌ను కవ్విస్తూ అడుగుతాడు ఓ తెలుగు సినిమాలో. పెళ్లి తర్వాత కొంత మంది దంపతులు ముద్దు వద్దంటారట. పూర్తి వారంలో ప్రతి ఐదుగురు దంపతుల్లో ఒక జంట ముద్దు పెట్టుకోవడం లేదని ఓ సర్వేలో తేలింది. ఒక వేళ పెట్టుకున్నా పెట్టీ పెట్టనట్లు ఉంటుదట. ఐదు సెకన్లు కూడా పెదవులను పెదవులు పెనవేసుకోవని సర్వే ఫలితాలు చెబుతున్నాయి.

అయితే, 18, 24 ఏళ్ల మధ్య వయస్సు గల భాగస్వాములు మాత్రం భలే రోమాంటిక్‌గా ఉంటారట. వారంలో కనీసం 11 సార్లయినా ముద్దులతో ముంచెత్తుకుంటారని సర్వేలో తేలింది. బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్ ఇందుకు సంబంధించిన అధ్యయనం జరిపి ఫలితాలను విడుదల చేసింది.

English summary
A survey has found that one in five married couples do not kiss for an entire week.
Story first published: Wednesday, August 3, 2011, 16:32 [IST]

Get Notifications from Telugu Indiansutras