కనుక ఈ ప్రక్రియలో వారు ఎంత లోతులకు వెళ్ళాలంటే అంత లోతులకు వెళ్ళి వారి వారి ఒత్తిడులనుండి, సమస్యలనుండి దూరం అవుతూంటారు. ఒకరినొకరు బెడ్ రూమ్ లో ప్రేమించుకోడం అంటే మొదటగా భార్యా భర్తలు నగ్న సంచారమే. దాని తర్వాత ఇంకా లోతుల్లోకి వెళ్లటం. ఇక ఆపైన వారి చర్యలు ఒకరినొకరు రెచ్చగొట్టుకొని స్త్రీ, పురుషుల అవసరాలు తీరితే గాని తృప్తి పడరు.
ప్రేమ అనేది ఇరువురు వ్యక్తుల మధ్య శారీరకంగా కంటే కూడా మనస్సుతో హాయిగా కలిసివుండే చర్య. 17 శతాబ్దంలో జాన్ డాన్ అనే ప్రఖ్యాత కవి బెడ్ రూమ్ లో పడుకొని తన ప్రియురాలిపై అనేక కవితలు రాశాడు. ఆయన కవితలు రెచ్చగొట్టేవే. తన ప్రియురాలి కన్నెత్వం తనకు ఇచ్చేయాలంటూ కవితలల్లాడు. ఒక కవితలో - తాను పడకగదిలో పడుకున్నపుడు ఒక పురుగు తనను, ప్రియురాలిని కుడుతుంది. 17 శతాబ్దిలో సంయోగం అంటే ఆడ మగల రక్తం కలియటంగానే చెప్పేవారు. ఇద్దరిని కుట్టిన పురుగులో ఇరువురి రక్తం వున్నది కనుక ఇక వారు మరోమారు మరోమారు కలుసుకోడం ఎందుకు? వాస్తవంలో ఆ రోజులను బట్టి వారికి వివాహమయినట్లే! అయితే, తన ప్రియురాలు ఆ పురుగును చంపివేయడంతో కవి అయిన డానే ఆమె వివాహబంధాన్నే తుంచివేసిందంటాడు.
ఆ విధమైన ఊహాగానాలు నేటికి ఊహించని రీతిలో రెచ్చగొట్టే స్ధితికి చేరాయి. పడక గదిలో ఒకరికొకరు శారీరకంగా హింసించుకునే స్ధితికి చేరాయి. ఇతర అంశాలపై తమకుగల ఒత్తిడులను సైతం భార్యాభర్తలు తమ పడకగదులలో తొలగించుకొని ఊరట చెందే స్ధాయికి చేరాయి. కనుక శారీరక సెక్స్ ప్రేమలో భాగంగా మంచిదే!