•  

ఎపుడూ ఒకటేనా....? మరో రకంగా కూడా ప్రయత్నించండి!

Spice up your Bedroom moves...
 
ఎప్పుడూ ఒకే రకమైన రతి క్రీడా? విసుగెత్తిందా? దైనందిన రొమాంటిక్ జీవితానికి కాస్త భిన్నంగా చేసి ఆనందించటానికిగాను దిగువ టిప్స్ ఆచరించి చూడండి.....

మీ రొమాంటిక్ జీవనానికి అవసరమైన సెట్టింగ్ వేయండి... దానికి మీ బెడ్ రూమ్ ఎంతో సౌకర్యవంతంగా వుండాలి సుమా! స్వర్గాన్ని మరపించాలి. ఆహ్లాదమైన లైటింగ్, ఇంపైన ఫర్నిచర్, గాలికి వేలాడే కర్టెన్లు, ఇవన్నీ మీకు రొమాన్స్ లో మరింత ఆహ్లాదాన్నిస్తాయి. బెడ్ రూమ్ ఆటంకాలతో ఎట్టి అసౌకర్యం లేకుండాను, స్వేచ్ఛగాను వుండేలా చూసుకోండి.

జీవితంలో అన్నిటికి తొందర పడకండి...ఆనందాన్ని కోల్పోతారు! కరక్టే...వేగవంతమైన జీవితాలలో ఎక్కడా నిలబడేందుకు, ఆస్వాదిస్తూ చూసేందుకు ఎవరికీ సమయం లేదు. నేటి రోజుల్లో మన జీవితాలు వేగంగాను, బిజీగాను నడుస్తున్నాయి. ఆనందించే సమయం ఎవరికీ లేదు కాని నిజమైన సంబంధాలను ఆనందించాలంటే కొంచెం నిదానంగానే వ్యవహరించాలి. ముందస్తు సరస సల్లాపాలకు సమయం తీసుకోండి. రతి క్రీడకు మాత్రమే సమయం అంటూ వ్యవహరించకండి. సెక్స్ చర్యలకు మాత్రమే కాక ప్రేమకు కూడా కొంత సమయం కేటాయించండి. దాని ప్రభావంతో భాగస్వామి సెక్స్ చర్యలలో కొంత తేడా కనపడుతుంది.

సీన్ మార్చండి....
రొటీన్ కు భిన్నంగా వ్యవహరించండి. మార్పు కొరకు మీ రిద్దరూ ఒక హోటల్ రూమ్ బుక్ చేసుకోండి. కొత్తగా ఎంపిక చేసుకున్న ఈ హోటల్ గది మీకు మరింత సాహసోపేతంగా వుండగలదు. ఒకరి చర్యలు మరొకరు చేపట్టండి. వివిధ మార్గాలు ప్రయత్నించండి. భాగస్వామిని అభినందించండి. భాగస్వామిని ప్రశంసించడం లేదా ఆమె/అతని చర్యలను మెచ్చుకోడం, చూడటానికి చాలా బాగా వున్నావనటం మొదలగు మాటలు ఆమె లేదా అతనికి టానిక్ లా పని చేసి బెడ్ లో మరింత ప్రోత్సహిస్తాయి. హీరు ఆవించిన దానికంటే కూడా అధిక ఆనందం దొరకగలదు.

ఏదైనా ఒక ప్రత్యేక చర్య భాగస్వామికి మంచి కిక్ ఇచ్చేదిగా ఉందా? కొనసాగించండి.
కొత్త మార్గాలను పద్ధతులను అన్వేషించండి. బెడ్ రూమ్ అలంకరణ మార్చండి. ఎపుడూ ఒకేలా వుండేలా చూడకండి. రతి క్రీడలో భంగిమలను ఎదురుగా ఉంచబడిన అద్దంలో చూసుకోండి. ఈ చర్య మీకు మరింత కిక్ ఇస్తుంది. కొద్ది సేపు' ఫెంగ్ షూఇ ' లాంటి సాంప్రదాయాలు మరచిపొండి. ఇక అంతే సంగతులు.....ఆ క్షణంలో ప్రపంచాన్ని మరోసారి మరచిపోయినట్లే... ఇద్దరూ కలసి బాత్ రూమ్ లో చొరబడండి. ఒకరి శరీరంలో మరొకరు తాకని ప్రదేశం లేదని తీవ్ర అన్వేషణలో పడండి. బాడీ కెమిస్ట్రీని పూర్తిగా అధ్యయనం చేయండి. నూతన ఉత్తేజాన్ని పొందండి.

English summary
Complimenting your partner and appreciating his/herm moves can go a long way. Just letting her/him know how good she/he looks can boost her/his confidence and make him/her do things in bed that you probably did not expect. If you find some particular move is doing you good and igniting your passion let him/her know that your loved it.
Story first published: Tuesday, August 2, 2011, 11:40 [IST]

Get Notifications from Telugu Indiansutras