నిజానికి ఈ అసంతృప్తి వెనుక అనేక కారణాలుంటాయంటున్నారు సెక్సాలజిస్టులు చెపుతున్నారు. చాలామంది స్త్రీలకు ప్రత్యేకించి కొన్ని శరీర భాగాల మీద భర్త చేయి వేస్తే కస్సుబుస్సులాడ్తారు. అలా కోపం తెచ్చుకోడానికి కారణమేమై ఉంటుందో తెలుసుకొని భర్తలు నడుచుకోవడమే కాకుండా, మొండితనంగా అక్కడ చేయి వేసేందుకు ప్రయత్నించరాదని సలహా ఇస్తున్నారు. లేనిపక్షంలో ఒక సుఖరాత్రి కాస్తా నిట్టూర్పుల రాత్రిగా మిగిలిపోతుందని, ఫలితంగా ఒకరంటే మరొకరికి అయిష్టం పెరిగిపోతుందని కూడా చెపుతున్నారు.
సమస్యను పరిష్కరించేందుకుగాను, ముందుగా చొరవ చూపించాల్సింది భర్త మాత్రమే. భార్యను తమ దగ్గరికి తీసుకుని, ఓపిగ్గా ఆమెలో ఉన్న బాధ లేదా కోర్కెను తెలుసుకునేందుకు ప్రయత్నించాలి. సెక్స్‌లో ఇద్దరూ సమానంగా అనుభవాలను పంచుకునేలా ఒప్పించాలి. ముఖ్యంగా, భార్యకు సెక్స్ పట్ల ఉండే ఇష్టాయిష్టాలను తెలుసుకోవాలి. ఒకవేళ ప్రత్యేకించి కొన్ని భాగాలపై చేతులేయవద్దు అనంటే కొన్నాళ్లు ఓపికపట్టి, ఆ అనుభూతిలో ఉండే తృప్తిని తెలియజెప్పే పుస్తకాలనో, సినిమాలనో చూపించి తమ వైపుకు తెచ్చుకునేందుకు ప్రయత్నించాలని అంటున్నారు.
సెక్స్ విషయంలో ఒకరికొకరు సహరించుకోవాలి తప్ప అవగాహనా లోపంతో యుద్ధం చేసుకోకూడదు. అలాగే, భర్తకు ఇష్టమైన పనికి భార్య ఇష్టం లేకపోయినా ఇష్టం చేసుకోవాలి. అలాగే భర్త కూడా భార్యకు ఏ రకమైన చర్యలు ఇష్టమో తెలుసుకొని ప్రవర్తించాలి. అలా ఒకరికొకరు అర్థం చేసుకున్నప్పుడే దాంపత్యం సజావుగా సాగుతుంది. ముఖ్యంగా రతిక్రీడ కొరకే కాకుండా దంపతులిరువురూ కలిసి ఇతర చర్యలలో సైతం గడిపే సమయాన్ని పెంచుకోవాలని వారు చెపుతున్నారు.