మీడియా లో ఎక్కడ చూసినా సెక్సు కనపడుతుంది. మీ చుట్టుపక్కలు పరిశీలించండి. జనం మాట్లాడేది, గమనించేది, ఆలోచించేది అంతా సెక్సు మయం. చిన్నపాటి, మెసేజ్ లు, ప్రకటనలు లేదా ఫిల్ములు, ఏవైనప్పటికి ప్రజలు వారి సెక్సు భావాలనే గుప్పిస్తున్నారు. శాటిలైట్ టెలివిజన్, ఇంటర్నెట్, చివరకు ప్రపంచీకరణలు వీటితో సెక్సు తీవ్ర ప్రచారానికి గురవుతోంది. ఆధునిక పరికరాలకు మనమంతా ధ్యాంక్స్ చెప్పాల్సిందే !
గతంలో సాధారణంగా ప్రతివారూ కూడా తమ బంధుత్వాలకు, వ్యాపారాలకు లేదంటే మతపర కార్యక్రమాలకు, విధులకు పరిమితమయ్యేవారు. కాని ఇపుడు...చాలామంది మనోభావాలలో ముందుగా వచ్చేది సెక్స్ పర ఆలోచనలే. అందుకు కారణం ఒకవైపు మీడియా, మరోవైపు ఇంటర్నెట్ సాధనాలని చెప్పవచ్చు. గతంలో సెక్స్ అనేది సబ్ కాన్షస్ మైండ్ లో వుండగా, నేడది కాన్షస్ మైండ్ కు చేర్చబడింది అంటారు -క్లినికల్ సైకాలజిస్టు డా. అరుణ బ్రూటా. టి.వి.ల లో ఏ ఛానెల్ చూసినప్పటికి లేదా ఏ ప్రకటన చూసినా, లేదా హిందీ సినిమాలు చూసినా ఎంతో కొంత సెక్సు శాతం కనపడుతూ ఆమె చెప్పేది నిజమేననిపిస్తుంది. ప్రత్యేకించి ప్రకటనలు తయారు చేసే కంపెనీలు ప్రకటన ఏదైనప్పటికి, చేతి రిస్టు వాచి కాని లేదా పురుషుడి అండర్ గార్మెంట్ గానీ తమ కంటెంట్లో ఒకే రకమైన భావాలను చొప్పిస్తున్నాయి. ప్రకటన దారులకు ఒకటే ధ్యేయం. తమ ప్రోడక్టును వీలైనంత గ్లామరస్ గా చూపి కొనుగోళ్ళు పొందటమే. ప్రకటనలు చూస్తుంటే, ఇక వేరే కొత్త తరహా ఆలోచనలు కూడా చూసేవారికి రావటం లేదు. సింగల్ గా వుండే వారు మేరేజ్ వరకు ఆగలేకపోతున్నారు. పెళ్ళైన వారు వారు చేయాలనుకున్న దానికంటే అధికంగా చేసుకుంటున్నారు. ఇక గే లు, స్వలింగ సంపర్కులు కొత్త తరహా సెక్సు విధానాలకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ రకంగా భారతీయులు అది వరలో కంటే ఇపుడు మరింత ఆసక్తికరంగాను, సౌకర్యవంతంగాను సెక్సును అనుభవిస్తున్నారు. ఇపుడు 'సెక్స్' అనే పదాన్ని స్వేచ్ఛగా ఉపయోగిస్తున్నారు. గతంలో అది మాట్లాడితే, బ్యాడ్ క్యారెక్టర్ లేదా అతి చొరవ, లేదా విప్లవ కారుడు అని కూడా అనేవారని డా. బ్రూటా చెపుతారు. సెక్స్ గురించి మాట్లాడరాదని నీతులు చెపితే, సగానికిపైగా జనం వారిని చెడుగా చూస్తున్నారు.
అంతే కాదు, కొత్త రకం వైబ్రేటింగ్ కండోమ్ ల సెక్సు బొమ్మల కొరకు, ఇంటర్నెట్ ఛాట్ రూమ్ లకు మరింత కృషి చేస్తున్నారు. సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్లలో సింగిల్స్, మ్యారీడ్ యువతులు రెచ్చిపోయి జవాబులిచ్చేస్తున్నారట కూడాను. దేశంలోని ప్రతి ప్రాంతంలోనూ ఇదే వరస కాగా, దీనిని ఒక సెక్స్ విప్లవంగా కూడా కొంతమంది అభివర్ణిస్తున్నారు. అయితే, ఏ విప్లవంలో అయినా సరే, వ్యతిరేకులుకూడా ఉంటూనే వుంటారు. ప్రజలు సైతం చాలా వరకు పరిస్ధితులను బట్టి నడుచుకుంటూనే వున్నారు. అయితే, నీతులు చెప్పే వారే ఇపుడు ఇది కామ సూత్రాలను నేర్పిన దేశమని, వైబ్రేటింగ్ కండోమ్స్ కూడా వచ్చిన ఈ కాలంలో మరింత ముందుకు పోవాలని విచ్చలవిడి కూడా చేయటం జరుగుతోంది. ఖచ్చితంగా చెప్పాలంటే, ఈ నీతులు చెప్పే వారందరూ ఇండియాలో మొదటి సారిగా చట్టబద్ధం చేయబడిన సెక్స్ టాయ్ వైబ్రేటింగ్ కండోమ్ తో పూర్తిగా మారిపోయారు. నేటికి, అందాల నటి శిల్పా శెట్టి బుగ్గలపై ఒక ఎయిడ్స్ అవగాహనా ప్రోగ్రామ్ లో రిచర్డ్ గెరె పెట్టిన ముద్దులు, ఆమె ఆమోదాలు ఎవరు మరచి పోగలరు ?
భారత దేశం ప్రపంచంలో ఎయిడ్స్ రోగ వ్యాపిత దేశాలలో మూడవదిగా వుంది. ఇకనైనా ఈ రకం విచ్చలవిడి అరికట్టాలి. సెక్స్ అంటూ పాకులాడే వారంతా తమ ఎనర్జీలను నిర్మాణాత్మక అంశాలకు మళ్ళించాలి. మన కుటుంబాలలో పిల్లలు అనుకరణల పేరుతో వెర్రి తలలు వేస్తుంటే చూస్తూ ఊరుకుంటామా ? సెక్సు అంశాన్ని సరైన రీతిలో వినియోగించే భాధ్యత సమాజంలో కొరవడింది. సెక్స్ ను తేలికగా తీసుకుంటున్నాం. ఫలితం స్కూలు విద్యార్ధులు ఆ చెడు ప్రభావాలకు లోనవుతున్నారు. స్కూలు విద్యార్ధులనే కాదు సమాజంలోని అన్ని వర్గాలకు విపరీత సెక్సు చేరిపోతోంది. మరో ఉదాహరణ, ఏ నాటి కానాడు మీడియా హాట్ బెడ్ గా పరిగణించే కార్పొరేట్ రంగంలోని బిపిఓ సంస్కృతి. అధిక జీతాలు, రాత్రి పూట ఉద్యోగాలు - యువత ను మానసిక రోగులను చేసేస్తున్నాయి. నిర్లక్ష్యంగా వ్యవహరించేలా చేస్తున్నాయి. డ్రగ్స్ వినియోగం కూడా పెరిగిపోతోంది. ప్రమాద హెచ్చరికలు వినవస్తున్నాయి. అధికార్లు నిస్సహాయతతో కాల్ సెంటర్లలో హెచ్ ఐ వి టెస్టింగ్ కేంద్రాలను పెడుతున్నారు.
ఒక్క ముక్కలో చెప్పాలంటే, బిపిఓ ల సిబ్బందే కాదు సమాజంలోని స్కూలు పిల్లలు, వివాహామైనవారు అందరూ కూడా దిన దినం వారు చూస్తున్న సెక్స్ ప్రేరేపిత సంఘటనలకు వశులై మంచీ చెడూ తెలుసుకోలేక ఏది కావాలంటే అది సెక్స్ పరంగా చేసేస్తున్నారు. మ్యారేజ్ అన్న పదానికున్న విలువను తగ్గించేస్తూ ఓపెన్ మ్యారేజ్ పద్ధతి వచ్చేసింది. ఇది వివాహ బంధాలను, కుటుంబ సాంప్రదాయాలను బలహీన పరిచేసిందంటున్నారు సైకాలజిస్టులు. అభివృద్ధి అన్ని రంగాలలో వలెనే సెక్స్ లో కూడా చోటు చేసుకుంటోంది. మంచి గాను, చెడు గాను కూడా సంఘటనలు జరుగుతున్నాయి. అయితే, చివరకు కావలసింది భధ్రత, సంక్షేమం అన్న విషయాలను అవగాహన చేసుకొని కొనసాగటం శ్రేయస్కరంగా మానసిక నిపుణులు సలహాల నిస్తున్నారు.