యువతులైతే, మొదటి సారి లైంగిక చర్య బాధాకరంగానే వుంటుంది. అయినా కొనసాగించండి. వారు భయపడేది పెయిన్ కారణంగా కాదు. చాలా సార్లు ఈ నొప్పి వేలుతో నొక్కినట్లే. అయితే, నొప్పి వలన ఏర్పడే భయమే పరిస్ధితిని తారుమారు చేస్తుంది. ఈ భయం కారణంగానే మహిళలు కొద్దిగా ముట్టుకుంటే చాలు కుచించుకుపోతారు. ఇక్కడే పురుషులు ప్రధాన పాత్ర వహించాలి. మొదటగా, ఆమె మీతో ఎట్టి సంకోచం, భయం లేకుండా స్వేచ్ఛగా వుండేలా చూసుకోవాలి. ఆమెప్రయివేటు (వజీనా) భాగంలో ద్రవాలు ఊరేందుకవసరమైన ముందస్తుచర్యలను చేయాలి. హైమన్ పొరను తొలగించటానికి ప్రయివేటు భాగంలో వేలితో ఒరిపిడి చేయండి. అపుడు అతి నెమ్మదిగా లైంగిక చర్యకు ఉపక్రమించండి. ఇక్కడ ప్రధానమైంది - నిదానం. ఈ చర్యలో ప్రయివేటు భాగంనుండి రక్తం రావచ్చు, రాకపోవచ్చు. మొదటి కలయికలో మహిళలకు బ్లీడింగ్ జరగాలనేది నిస్సందేహంగా ప్రజలకుగల తప్పుడు అభిప్రాయం. హైమన్ పొర చిట్లితే రక్తం వస్తుంది. అయితే, కన్నెత్వానికి చిహ్నంగా చెప్పబడే ఈ పొర ఇతర కారణాల వలన కూడా చిట్లిపోగలదన్న వాస్తవాన్ని కూడా గ్రహించాలి. కఠిన వ్యాయామాలు చేయడం లేదా సైకిల్ తొక్కడం లాంటి పనులుచేసేటపుడు కూడా ఈపొర చిట్లవచ్చు. కొన్ని కేసులలో, అసలు ఈ పొర లేకపోవచ్చు.లేదా మహిళలు స్వయంతృప్తి చేసుకునే సమయంలో ఒరిపిడికి చిట్లిపోవచ్చు. మొదటి కలయికలో రక్తం వచ్చినా, రాకపోయినా ఆమె కన్నెత్వం పోయిందనే అపనమ్మకాన్ని పొందవద్దు. ఆమెపై మొదటి లైంగిక చర్యలో విశ్వాసం ఉంచండి. అట్టి సందేహాలేమైనా వుంటే మొదటిలోనే తీర్చుకోవాలిగానీ పడక సమయంలో కాదని గుర్తుంచుకోండి.
గర్భనిరోధక మార్గాలు ఫెయిల్ కావచ్చు. అవాంఛనీయ గర్భం రావచ్చు. లైంగిక చర్యలో అంగాన్ని సమయానికి తీసివేయడం లేదా మహిళల రుతుక్రమంపై ఆధారపడి సేఫ్ సెక్స్ చేయటం లాంటివాటిపై ఆదారపడవద్దు. పెళ్ళి కాని జంటలు కండోమ్ లు వాడవచ్చు. పెళ్ళి దగ్గరలోనే వుంటే మహిళలు పెళ్ళికి ఒక నెల ముందరగా గైనకాలజిస్టును సంప్రదించవచ్చు. డాక్టర్ అవసరమైన గర్భ నిరోధక మాత్రలు ఇస్తారు. ఇక జంటలు హనీమూన్ వరకు కూడా గడిపేయవచ్చు. తర్వాత మరోసారి గైనకాలజిస్టును సంప్రదించి వారికి సరియైన గర్భనిరోధక మార్గం ఏమిటనేది నిర్ణయించుకోవచ్చు.
లైంగిక చర్యలో మరో చికాకు కలిగించే అంశం ప్రయివేటు భాగాలలో ఊరే ద్రవాలు చికాకు కలిగించటం. దానికి వేరే మార్గం లేదు. భరించాల్సిందే ! లేదా చర్యను నిలిపివేయాలి. కనుక దానిగురించి పట్టించుకోకండి. పట్టించుకొని, శుభ్రతలకుగాను అదనపు బెడ్ షీట్ వేయకండి !