కనుక స్త్రీని మానసికంగా సెక్స్‌కి సమాయత్తం చేయాలి. ఇందుకోసం సెక్స్‌కు సంబంధించిన సంభాషణ చేయాలి. రతిక్రియకు సంబంధించిన చిత్రాలు ఏమైనా ఉంటే దంపతులు కలసి ఆస్వాదించవచ్చు. ముద్దులు, చిరు కౌగిళ్లతో ప్రేమగా దగ్గరకు తీసుకోవాలి. మొత్తంగా మీరంటే ఆమెలో ఎటువంటి భయం లేకుండా చేయగలగాలి. ఆ తర్వాత కూడా ఆమె సెక్స్‌కు విముఖత ప్రదర్శిస్తుంటే అందుకు కారణమేమిటో మెల్లగా తెలుసుకోవాలి. అంతేకానీ, కాదన్నందుకు చిందులేసి గోల చేయకూడదు. అలా చేస్తే తీయగా గడిచిపోవాల్సిన తొలిరాత్రి చేదు అనుభవాన్ని మిగుల్చుతుంది. కొత్తగా పెళ్లయిన కొంతమంది అమ్మాయిలలో ప్రెగ్నెన్సీ భయం పట్టుకుని ఉంటుంది. ఈ విషయంపై భార్యకు నచ్చజెప్పేందుకు భర్త ప్రయత్నించడు. కనుక తీపిరాత్రిగా గడిచిపోవాల్సిన తొలిరాత్రిని చేదురాత్రిగా మిగిలిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇద్దరిదీ అని గుర్తుంచుకోవాలి.
శోభనం రాత్రి కొత్త దంపతుల్లో అనేక అపోహలు ఉంటాయి. సెక్స్‌పై రకరకాల అభిప్రాయాలను కలిగి ఉంటారు. ఒకరికొకరు పరస్పరం పరిచయం లేకుండా పెళ్లి ద్వారా ఒకటైనపుడు అయితే ఇవి మరీ ఎక్కువ ఉంటాయి. అయితే అటువంటి జంటల్లో ఏ ఒక్కరూ తొలిరేయినాడు ఆందోళనకు గురి కాకూడదు. సెక్స్‌కు ముందు మనసును అందుకు సిద్ధం చేసుకోవాలి. నిజానికి సెక్స్‌ ఆలోచనల విషయంలో పురుషులు - స్త్రీల మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. పురుషులలో కలిగే వాంఛ చాలావరకూ శారీరక సంబంధమైనదిగా ఉంటే స్త్రీలలో అది మానసికమైనదిగా ఉంటుంది.