•  

సెక్సులో భారతీయులు వీక్

Weak in Sex knowledge
 
భారతీయులకు సెక్సులో పరిజ్ఞానం తక్కువే అంటోంది ఓ కండోమ్‌ల కంపెనీ. తమ సర్వేలో భారతీయులలో సెక్సు పరిజ్ఞానం తక్కువ అని తెలిసిందని సదరు కండోమ్ సంస్థ తెలిపింది. దేశంలో దాదాపు మూడొంతులకు పైగా శాతం భారతీయులకు అధికారిక రతిక్రియలో వారికి ప్రేమ, గౌరవంతోపాటు ఆనందం తక్కువేనని వెల్లడించింది. ఇందుకు గాను వారికి సెక్స్ ఎడ్యుకేషన్ గురించి తెలపాలని ఆ సంస్థ పేర్కొంది. సెక్స్ పరిజ్ఞానం ఉన్నవాళ్ళే అందులోనున్న సుఖాన్ని అనుభవిస్తున్నట్లు తమ సర్వేలో తేలిందని ఆ సంస్థ తెలిపింది.

దేశంలోని చాలామంది తమకు మరింత సెక్స్ పరిజ్ఞానం కలిగివుంటే మరింత ఆనందించేవారమని, తమకు సెక్స్ పరిజ్ఞానం గురించి తెలుసుకునేందుకు తాము తమ మిత్రులపై ఆధారపడుతామని, వారు కూడా తమ వయస్కులవారే కాబట్టి వారికి తోచిన సలహాలతోనే తాము జీవితాన్ని నెట్టుకొస్తున్నట్లు తెలిసిందని సర్వే నిర్వహించిన సంస్థ తెలిపింది. తాము నిర్వహించిన సర్వేననుసరించి భారతీయులకు దాదాపు సగానికి పైగా శాతం మంది తమ మిత్రులనుంచి సెక్స్ పరిజ్ఞానం గురించిన విషయాలను తెలుసుకుంటుంటారని తేలినట్లు సంస్థ తెలిపింది.

English summary
A survey revealed that indians are very weak in Sex knowledge.
Story first published: Thursday, June 16, 2011, 16:44 [IST]

Get Notifications from Telugu Indiansutras