•  

సెక్స్ సామర్థ్యంపై ధూమపాన ప్రభావం

Smoking will not help in Sex
 
పొగ తాగని వాడు దున్న పోతై పుట్టున్ అన్నాడు గురుజాజ కన్యాశుల్కంలోని గిరీశం. అయితే, ధూమపానం వల్ల సెక్స్ సామర్థ్యం దెబ్బ తింటుందని అంటున్నారు. సిగరెట్ తాగటం మగతనం అనుకుంటారేమోగానీ అది వారి మగతనాన్ని దెబ్బతీస్తుందని తెలుసుకోరని నిపుణులు అంటారు. సిగరెట్‌లో ఉండే పొగాకు మండుతూ అందులో నుండి దాదాపు 300 నుండి 400 ప్రమాదకర రసాయనాలను విడుదల చేస్తుంది. ఈ రసాయనాల ప్రభావం రక్తనాళాల మీద ఉంటుంది. ఫలితంగా రక్త ప్రవాహానికి అవరోధం కలుగుతుంది.

పురుషాంగం స్తంభించడానికి మూలం అంగంలోకి ప్రవహించే రక్తం. దానిలో ఇబ్బంది ఏర్పడితే అంగస్తంభన సమస్య తలెత్తుతుంది. పొగతాగే ఆడావారికి ఇదే సమస్య. యోని గోడలకు, రక్త సరఫరాకు ఆటంకం ఏర్పడటం వల్ల సెక్స్‌ని సరిగా ఆనందించలేరు. అంగప్రవేశం బాధాకరమని అనిపిస్తుంది. క్లైటోరిస్‌కు సరఫరా తగ్గి సెక్స్ స్పందనలు సరిగా ఉండవు. ఇన్ని రకాలుగా ఇబ్బందిపెట్టే పొగను మానకపోతే అనారోగ్యాలను అందుకోవాల్సి ఉంటుంది.

English summary
It is said that smoking will affect Sex life. It will not help healthy Sex. It is better to avoid smoking for good Sex life.
Story first published: Thursday, May 26, 2011, 16:43 [IST]

Get Notifications from Telugu Indiansutras