పదవ రోజు దంపతులిద్దరూ ఏకాంతంలో కూర్చుని యుండగా సరస వచనాల చేత మెల్లగా ఆమె మనస్సును స్వాధీనం చేసుకోవాలి. సెక్సు గురించి పూర్తి విజ్ఞానం చాలామంది ఆడ పిల్లలకు అంతగా తెలియదు. కనుక సుతిమెత్తగా వ్యవహరించాలి. ఎంతో మెలకువతో, నిపుణతతో కార్యాన్ని సాధించాలి. ఆమెను రంజింపచేయడానికి, ఎలాగో మెప్పించి తనదానిగా చేసుకోవడానికి ప్రయత్నించాలి. అంతేకానీ కామాతురుడు కాకూడదు. స్త్లీలు పువ్వల్లాంటి వారు. వారితో వ్యవహారమంతా మృదువుగా వుండాల్సిందే గానీ మోటుగా ఉండకూడదు.
శోభనం నాటి తొలి రాత్రి ఎంతో చాతుర్యాన్ని, నిగ్రహాన్ని ప్రదర్శించాలి. అంతకు పూర్వము ముక్కు, ముఖము ఎరుగని మనిషిముందు నిస్సిగ్గుగా నిలబడటమన్నా, అతనికి శరీరాన్ని అప్పగించి ఆత్మాభిమానాన్ని చంపుకోవడం అంత తేలిక విషయం కాదు స్త్రీకి. వాత్సాయనుడు శోభనం గురించి ఒక సందేశాన్ని ఇచ్చాడు. ఆదేమిటంటే శోభనం మూడు రాత్రులు నూతన దంపతులిద్దరు కలిసి నేలమీదే పడుకోవాలి. కఠిన బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఉప్పూ, పులుపూ లేని ఆహారం తినాలి. ఆ తరువాత వారం రోజులు మృదుమధుర సంగీత ధ్వనులు వినివస్తుండగా మంగళ స్నానాలు చేసుకొని ముద్దులొలికేలా అలంకరించుకొని ఏక కంచంలో భోజనం చేస్తూ కులాసాగా తిరగాలి.