ఆ మధ్యకాలంలో ఉల్లిఘాటు అదరగొట్టింది. ఉల్లి ధరలను చూసి జనంతో పాటు పాలకులు బెంబేలెత్తిపోయారు. ఇలా అపుడపుడు కోయకుండానే కన్నీరు తెప్పించే ఉల్లి ఒక దివ్యౌషధం కూడా పని చేస్తుందని మన పెద్దలు చెపుతుంటారు. దీంతో శృంగార జీవితంలో సెక్స్ కోరికలకు ఉల్లిపాయలకు సంబంధం ఉందని విద్యావంతుల నుంచి పామరుల్లో బలమైన నమ్మకం ఉంది. అందుకే గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువకులు ఎక్కువ సంఖ్యలో ఉల్లిపాయలను ఆరగిస్తుంటారు. ఇలా ఆరగించడం వల్ల వారిలో సెక్స్ కోరికలు విపరీతంగా పుడుతున్నాయన్నది కొందరి వాదనగా ఉంది.
నిజానికి విపరీతమైన సెక్స్ వాంఛలకు పెద్ద ఉల్లిపాయలే కారణమని యువతీయువకులు భావిస్తుంటారు. అందువల్లనే కొంత మంది ఉల్లిపాయలు తినరని అంటుంటారు. అయితే సెక్స్ కోరికలు, ఆలోచనలకు ఉల్లిపాయలకు మధ్య ఏ విధమైన సంబంధం లేదనే కొందరు సెక్స్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వయసులో పుట్టే అలజడి, వయసు ప్రభావం తదితర అంశాల ఆధారంగా సెక్స్ కోరికలు ఆధారపడి ఉంటాయంటున్నది వీరి వాదనగా ఉంది.
Indiansutras - Get Notifications. Subscribe to Telugu Indiansutras.