పడక గదికి చేరిన తర్వాత మనసులో సెక్స్ కోరికలు తప్ప మరే కోరికలకు చోటు కల్పించకూడదు. అలా ఉండటానికి ఇద్దరూ ప్రయత్నించాలి. ఏవైనా సమస్యలుంటే పడక గది బయటే చర్చించుకుని వాటికి అక్కడే ఫుల్‌స్టాప్ పెట్టేయాలి. ఆ సమస్యలను చర్చించేందుకు సెక్స్ సమయాన్ని వాడుకోకూడదు. ఆనందకరమైన, సంతృప్తికరమైన సెక్స్ అన్ని సమస్యలను పరిష్కరిస్తుంది.
భాగస్వామిలో సెక్స్ అలజడులను రేపేందుకు ఎక్కడ స్పర్శిస్తే ఆమె/అతడిలో స్పందన వస్తుందో తెలుసుకుని సున్నితంగా స్పర్శిస్తూ ప్రారంభించండి. అలా నెమ్మదిగా వారిని సెక్స్‌కి సంసిద్ధులను చేసి పూర్తి స్థాయి సెక్స్‌కు తీసుకెళ్లవచ్చు. అంతేకాదు లైంగిక కబుర్లను చెప్పడం కూడా సెక్స్ కోర్కెల ద్వారాలను తెరువవచ్చు. సెక్స్ తృప్తి అనుభవించిన జంటల్లో మానసిక ఆందోళనలు కానరావు. అంతేకాదు పూర్తి ఆరోగ్యానికి కూడా సెక్స్ మంచి మందు అంటున్నారు సెక్సాలజిస్టులు.