నాయకుని మీది గౌవరం చేత కూడా స్త్రీ తిరస్కరిస్తుందని చెబుతున్నారు. ఈమె అతి కష్టం మీద స్వాధీనంలోకి వస్తుందట. అభియోగమంటే కోరిక. ఆ కోరికను తొలుత అంగీకరించక స్నేహానికి అంగీకరించిన స్త్రీ సులభంగా స్వాధీనంలోకి వస్తుందని ప్రాచీన కామశాస్త్ర నిపుణుల అభిప్రాయం. పరిచయంతో మొదలై భావాన్ని వ్యక్తం చేసే స్త్రీ తొలి ప్రయత్నంలోనే పురుషుడికి స్వాధీనమవుతుందని అంటున్నారు.
ఓ రకమైన స్త్రీ రతి భావనను వ్యక్తం చేయదని నిపుణులు అంటున్నారు. ఇటువంటి సందర్భాల్లో అభియోగ సమయంలో స్త్రీ భావాన్ని ప్రయత్నపూర్వకంగా తెలుసుకోవాలని చెబుతున్నారు. సంకేతం ఇవ్వక, గ్రహించక ఉండే స్త్రీని దూతీ సౌధ్య అని పిలుస్తారు. సంకేతాన్ని గ్రహించి మౌనంగా ఉండే స్త్రీ సంశయంతో ఉండి క్రమక్రమంగా స్వాధీనమవుతుందని కామశాస్త్ర నిపుణుల అభిప్రాయం. అభియోగం సహించిన స్త్రీని స్నేహంగా సాధించవచ్చునట. ఆ విధంగా చేయాలని దాని భావమంటారు. యాచించినా ఇష్టపడని స్త్రీ ఆత్మగౌరవానికి భంగం వాటిల్లుతుందని భావిస్తుందని చెబుతున్నారు.