హృద్రోగాలు, పక్షవాతం, వివిధ కండరాలకు సంబంధించిన జబ్బులు సెక్స్ చేసేవారిలో చాలా తక్కువగా వస్తాయని సెక్సాలజిస్టులు చెపుతున్నారు. ప్రపంచంలోని కార్డియాలజిస్టులందరూ అంగీకరించిన విషయం ఇది. వారానికి కనీసం నాలుగుసార్లు సెక్స్‌లో పాల్గొనేవారి ఆరోగ్యానికి ఎటువంటి ఢోకా లేదని వైద్యులు ధృవీకరిస్తున్నారు.
ఒకప్పుడు సెక్స్‌ను ఓ వ్యాయామంగా భావించడం జరిగింది. అంతేకాదు సెక్స్‌లో కనీసం అరగంటపాటు శ్రమపడితేగాని ఫలితం ఉండదని చెప్పిన సంగతులూ ఉన్నాయి. ఇప్పుడు వాటన్నిటికీ మించి సెక్స్‌లో పాల్గొనటమే ఓ ఔషధమని వైద్యులు చెపుతున్నారు. ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో సెక్స్ పాత్ర ఎంతో అమూల్యమైనదని చెబుతున్నారు.