•  

ముద్దంటే చేదు కాదు

Kiss
 
ముద్దు వలన చాలా లాభాలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ముద్దు వల్ల ఆనందం తద్వారా ఆరోగ్యం ఉత్తేజం తదితర పరిణామాలు ఉంటాయని చెబుతున్నారు. ముద్దుల వలన మనుషుల్లో మార్పులు, ఉత్తేజం కలగడం, మస్తిష్కంలో తీవ్రమైన ఒత్తిడి పెరిగి మనసు ఆనందడోలికల్లో తేలియాడుతుంది. దీంతో సెక్స్ కోరికలు విచ్చుకుంటాయని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. చుంబనాలవలన మీలోని హార్మోన్లు మీ పార్టనర్ శరీరంలోకి ప్రవేశించి ఇద్దరిలోనూ ఆ ప్రభావం వుంటుందంటున్నారు పరిశోధకులు. ఇది కేవలం రెండు పెదవుల స్పర్శ వలన మస్తిష్కంలో తీవ్రమైన అలజడిరేగి ఎమోషనల్‌గా మార్చివేస్తుంది.

ఈ చుంబనాలపై పరిశోధనలు చేసిన పరిశోధకులు హార్మోన్ల ప్రభావమేనని తేల్చిచెప్పారు. అయినాకూడా ఈ హార్మోన్లపై మరింతగా పరిశోధనలుగావిస్తున్నట్లు వారు చెప్పారు. ఈ సందర్భంగా 15 జంటలను ముద్దులకు ముందు, ముద్దులకు తర్వాత వారిలో ఉత్పత్తి చెందే ఆక్సీటానిక్ అలాగే కోర్టీసోల్ హార్మోన్లు శాతాన్ని లెక్కవేశారు. ముద్దుల తర్వాత ఆ జంటల్లో ఆక్సీటానిక్ హార్మోను ఇరువురిని దగ్గరకు చేరుస్తుందని, దీని శాతం పెరిగిందని అలాగే కోర్టీసోల్ హార్మోన్ శరీరంలో వేడిని పుట్టించి కామోద్దీపనాన్ని మేల్కొల్పుతుందని పరిశోధనల్లో తేలినట్లు పరిశోధకులు తెలిపారు.English summary
Kiss is increase partners happy double. Hormones will changed to your partner body with kiss, it will give him very 
 
 activness.
Story first published: Sunday, March 13, 2011, 15:54 [IST]

Get Notifications from Telugu Indiansutras