సెక్స్ గురించి మనిషి ఎప్పుడైతే ప్రకృతి సిద్ధంగా ఆలోచించడం మానేశాడో ఆనాటి నుంచే ఈ సమస్యలు ప్రారంభమయ్యాయి. ఓ స్త్రీ, పురుషుడి మధ్య అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో జరగాల్సిన ఆ విషయంలో విశృంఖలాన్ని జతచేసి అసహజమైన పద్ధతుల్లో ఆనందాన్ని వెతుక్కోవడానికి మనిషి ప్రారంభించిన నాటినుండి సెక్స్ విషయంలో అన్ని రకాల సమస్యలు మనిషికి ప్రారంభమైయ్యాయి. సెక్స్ విజ్ఞానం గురించి యుక్త వయస్సులోకి అడుగుపెట్టిన ప్రతి వారు అవసరమైన మేరకు తప్పక తెలుసుకోవాలి.
ప్రాచీన కాలంలో సెక్స్ అంటే ఓ గొప్ప విషయంగా, దాని గురించి తెలుసుకోవడం కూడా ఓ అవసరమైన చర్యగా ఉండేది. కానీ నేడు సెక్స్ అంటేనే ఓ బూతు విషయంగా దాని గురించి మాట్లాడడమే తప్పుడు విషయంగా భావించే స్థాయికి చేరింది. ఇందుకు ప్రధాన కారణం మన చుట్టూ ఉన్న వాతావరణమే. పాత రోజుల్లో సెక్స్ గురించి వాత్సాయనుడు కామసూత్ర లాంటి ఓ గ్రంధం రాయగలిగాడంటే ఆ రోజుల్లో సెక్స్ గురించిన విజ్ఞానం ఏపాటిదో మనం ఊహించవచ్చు. కానీ నేటి కాలంలో సెక్స్‌ సమస్యలకు పరిష్కారాలు చూపించడం మాని దాన్ని క్యాష్ చేసుకునే దిశగా వైద్యులు సైతం ప్రవర్తించడం శోచనీయం.