•  

సెక్స్ వల్ల నడుం నొప్పి వస్తుందా?

Back pain with Sex
 
ఎంతో ఆనందంతో అనుభవించాల్సిన దాంపత్య సుఖాన్ని స్త్రీలు నరకం చేసుకుంటున్నట్లు ఇటీవల పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. మారుతున్న జీవన విధానం వల్ల వారు నడుముపట్టు కోల్పోతున్నారట. కార్యాలయాల్లో పని ముందు లేదా కంప్యూటర్ల ముందు గంటలతరబడి పనిచేయటం వల్ల సాయంత్రం ఇంటికి వచ్చేసరికి నడుము నొప్పితో బాధపడుతున్నారని తేలింది.

నడుం నొప్పి సమస్య క్రమంగా పెరుగుతోందని చెబుతున్నారు. సెక్స్‌లో పాల్గొనటంతో ఆ నొప్పి మరింత ఎక్కువవుతోంది. వారానికోసారన్నా సెక్స్‌లో పాల్గొనలేని స్త్రీల సంఖ్య ఈ సమస్య కారణంగా భార్యాభర్తల సంబంధాలు బెడిసికొడుతున్న సందర్భాలు అధికమవుతున్నాయి. ఈ సమస్యకు బెడ్‌పై విశ్రాంతి తీసుకోవటం కాదంటున్నారు నిపుణులు. పనివేళలో మీ శరీరాన్ని ఒకే పొజిషన్‌లో ఉండేటట్లు లేకుండా చూసుకోవాలి. అలాగే నడుము మీద అధిక వత్తిడి పడని సెక్స్ భంగిమల్లో పాల్గొనాలని వారు చెపుతున్నారు.

English summary
Experts say that women are facing back pain with sex. The women who are working in offices before computers are suffering from back pain and it increasing, while they are participating in sex.
Story first published: Saturday, March 26, 2011, 16:16 [IST]

Get Notifications from Telugu Indiansutras