ఎయిడ్స్ వ్యాధి అధికంగా ఉన్న దేశాలలో భారత్ ప్రపంచలో మూడో స్థానాన ఉంది. దక్షిణాసియా దేశాలలో ఎయిడ్స్ పెరుగడానికి భారత్ ఆధారంగా ఉందని వారు చెపుతున్నారు. మహిళల్లో ఎయిడ్స్ పెరగడానికి భర్తలే కారణమని తేల్చారు. భర్తల వింత ప్రవర్తన కారణంగా వారిలో ఇన్ఫెక్షన్ అవుతోందని తేల్చారు. భర్తల విపరీతమైన, విచ్చలవిడి శృంగార కారణంగా మహిళలకు ఎయిడ్స్ సోకుతుందని పరిశోధన తేల్చిం.
భర్త వేధింపుల కారణంతో బతికే భార్యలకు ఎయిడ్స్ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని పరిశోధకులు తేల్చి చెప్పారు. మహిళల్లో కంటే భర్త చేతి మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురయ్యే మహిళల్లో ఎయిడ్స్ వ్యాధి సోకే అవకాశం ఉంది. భర్త ఆప్యాయత, అనురాగాలు ఎక్కువగా ఉన్న మహిళలతో పోల్చినపుడు ఈ అంశాలు బయట పడినట్లు పరిశోధకులు చెపుతున్నారు. అయితే ఈ ప్రమాదం అధికంగా భారతీయ మహిళలకే ఉందని కూడా వారు చెపుతున్నారు. భారత దేశంలో దాదాపుగా 2.5 మిలియన్ల మంది ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్నారు.