సెక్స్ విషయంలో నీరసం చోటు చేసుకుంటే కాస్త దానిమ్మ రసముంటే చాలునని అంటున్నారు. ఆరోగ్యం కూడా బాగు పడుతుందని అంటున్నారు. రోజూ ఒక్క గ్లాసు దానిమ్మ రసం తీసుకుంటే నీరసించి ముడుచుకుపోయే శరీరం నవయవ్వనంగా విచ్చుకుంటుంది. లండన్ పరిశోధకులు తేల్చిన విషయ ఇది. దానిమ్మపై పరిశోధనలు చేసిన వారు అందులో శృంగార ప్రేరేపిత ఔషధ గుణాలున్నాయని కనిపెట్టారు. పలాలు మన దైనందిన ఆహారంలో భాగమయ్యాయి. రకరకాల పండ్లు కాయలను మనం సీజనల్‌గా తింటుంటాం. ప్రతి పండు లేదా కాయలోనో మేలు చేసే ఔషధాలు ఎన్నో ఉన్నాయి. ఈ ఔషధాలు శరీరానికి శక్తిని కూడా ఇస్తున్నాయి. ఇందులో దానిమ్మ చేసే మేలు అంతాఇంతా కాదని అన్నారు. దానిలోని గింజలను ఒలుచుకునే ఓపిక ఉండాలే గానీ, అంతటి ఆరోగ్యం లభిస్తుంది.
దానిమ్మ రసంలో శృంగార రసాన్ని పెంపొందించే లక్షణాలున్నాయని తేలింది. సాధారణంగా శరీరంలోని ఆమ్లత్వాన్ని తగ్గిస్తుందనేది వైద్యశాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో చెపుతున్నారు. అలాగే కొన్నిరకాల కాన్సర్లకు కూడా విరుగుడగా నిలుస్తుందనేది ఎప్పుడో తేలిపోయింది. అలాగే దీనిలో హృద్రోగాలకు సంబంధించిన రోగాలను నివారించేందుకు దోహదపడుతుంది. దానిమ్మ రసాన్ని తీసుకోవడం వలన రక్త ప్రసరణ చాలా బాగా జరుగుతుందనేది సత్యం. అయితే చాలా కాలం తరువాత ఇందులో ఇంకొన్ని ఔషధ గుణాలున్నాయని పరిశోధనలు తేల్చేశాయి. దానిమ్మ గింజల రసాన్ని సేవిస్తే గుండెకు మేలు చేస్తుంది. కాని రక్తాన్ని శుద్ధి చేయడంలో భాగంగా అది కాస్త రక్తాన్ని శృంగార ప్రేరేపిత అవయవాలకు ప్రసారం చేస్తుంది. దీంతో అవి ప్రరేపితమవుతాయని పరిశోధకులు తెలిపారు. దీంతో శృంగార సామర్థ్యం పెరుగుతుందని పరిశోధకులు తేల్చారు.
Indiansutras - Get Notifications. Subscribe to Telugu Indiansutras.