•  

సెక్సులో సమ్‌థింగ్ స్పెషల్!

Something special in Sex
 
ప్రతి మనిషి సెక్స్ లైఫ్‌ను ఎంజాయ్ చేయాలని తపించిపోతుంటాడు. అందునా యువ జంటలైతే మరీను. తమ జీవిత భాగస్వామితో రతిక్రియలో పాల్గొనేముందు కొన్ని ప్రధానమైన అంశాలను దృష్టిలో ఉంచుకుని రతిక్రియలో పాల్గొనాలి. తరచూ జరిగే తంతులా కాకుండా కాస్త భిన్నంగా ఉండేలా ప్రయత్నిస్తే దాంపత్య జీవితం చాలా ఆనందమయంగా ఉంటుంది. రతిక్రియలో పాల్గొనేముందు మీరు స్వయంగా నృత్యం చేయండి లేదా మీ భాగస్వామితో కలిసి డాన్స్ చేయండి. మీకు డాన్స్ చేయడం వచ్చినా రాకపోయినా మీరు తప్పనిసరిగా డాన్స్ చేయాలి. ఎందుకంటే నృత్యం రతిక్రియకు పరోక్షంగా సహకరిస్తుందట.

డాన్స్ చేయడంతో మీలో నూతన ఉత్సాహం పెల్లుబుకుతుంది, మీలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. దీంతో మీరు మరింత ఉత్సాహంగా రతిక్రియలో పాల్గొనగలరు. ప్రతిరోజూ వర్క్ అవుట్ చేస్తుంటే మీ శరీరం సెక్సీగా తయారవుతుంది. దీంతో శరీరానికి రతిక్రియ చేసేందుకు శక్తి లభిస్తుంది. అలాగే యోగాలోని కొన్ని ఆసనాలు కూడా శృంగారానికి ప్రోత్సాహాన్నిస్తాయి. సంగీతం వింటుంటే మనసు ఉర్రూతలూగుతుంటుంది. మంద్రమైన మధుర సంగీతం రతిక్రియకు ఓ దివ్యౌషధంలాంటింది. రతిక్రియలో పాల్గొన్నప్పుడు మీకు నచ్చిన సంగీతం వింటుంటే రిథమ్‌కు తగ్గట్టు మీరు రతిక్రయలో శుఖాన్ని అనుభవించగలుగుతారు. మీరిరువురు ఒకరికొకరు రతి ఊహల గురించి చెప్పుకోండి. మీ ఊహల గురించి తెలుపుకున్న తర్వాత వాటిని అమలు చేయడానికి ప్రయత్నించండి.

మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు జరుపబోయే రతిక్రియగురించి చర్చించుకోండి. చర్చ జరిగేటప్పుడు వాదనలకు దిగకండి. మాటలతోనే శృంగారాన్ని ఒలకపోయండి. మీరిరువురు కలిసి ఉత్సాహభరితంగా ఉండేందుకు తగిన లవ్వాటలు ఆడుకోండి. ఇవి మిమ్మల్ని మీరు మైమరచిపోయేలా ఉండాలి. మీలో రతి వాంఛను మరింత పెంచే ఆటలేమిటో ముందుగానే సెలక్ట్ చేసుకుని వాటిని ఆడండి. లవ్ నోట్స్ అనేది మీ భాగస్వామిని ప్రేరేపించేదిగా ఉంటుంది. మీ భాగస్వామి మీ కోసం ఏమి రాశారో చదివేందుకు ఉత్సుకత కలుగుతుంది. దీంతో మీ ఆనందానికి అవధులుండవు.

మీరు మీ భాగస్వామితో కలిసి రొమాంటిక్ సినిమాను చూడండి. మీమధ్య ఎలాంటి దాపరికాలు లేకుంటే మీరిరువురు కలిసి రతిక్రియకు సంబంధించిన చిత్రాలనుకూడా చూడొచ్చు. ఆ తర్వాత మీరిరువురు కలిసి మీ రొమాన్స్ మూడ్‌లోకి వెళ్ళి ఆ అనుభూతులను పొందవచ్చు.English summary
Every person thinks for variety sex some times. Youth is very interest on variety sex. Every person must know some important point before make sex. Life will go with very happy, who are make experiments in sex.
Story first published: Sunday, February 27, 2011, 16:16 [IST]

Get Notifications from Telugu Indiansutras

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Indiansutras sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Indiansutras website. However, you can change your cookie settings at any time. Learn more