•  

సెక్స్ తృప్తికి మసాజ్ మంచి మందు

Kamasutra-Srungaram
 
దంపతులు పడకగదిలో బాడీ మసాజ్‌ ద్వారా శరీర భాగాలను పరస్పరం మర్ధన చేసుకోవడంతో వారిలో కామ వాంఛ రగల్చడంతో పాటు వెంటనే బాగా దగ్గర కావచ్చు. మర్ధనలో ఎప్పటికపుడు కొత్త నైపుణ్యాలు తెలుసుకుని, ప్రయోగిస్తూ ఉండాలి. తద్వారా భాగస్వామిలో గిలిగింతలు రేపవచ్చనని నిపుణులు అంటున్నారు.మీరు విన్న శోభనం కథలను రాత్రి పడుకునే సమయంలో మీ భాగస్వామికి వినిపించడం మరచిపోవద్దు. దీనికంటూ మీరు పలు రకాలుగా ఆసక్తి కలిగించే కథలను సెక్స్‌ పదాలు ఉపయోగించి చెప్పడం ద్వారా వారిలో వాంఛను ప్రేరేపించవచ్చునని చెబుతున్నారు.

మీ భాగస్వామితో సెక్స్‌ను ఎంత చక్కగా ఎంజాయ్‌ చేశారో, ఇంకా ఏయే రీతిలో ఎంజాయ్‌ చేయాలనుకుంటున్నారో తెలిపేలా వారికి తరచూ లేఖలను లోతైన విశ్లేషణలతో రాయండి. వారినెంత గాఢంగా మీరు కోరుకుంటున్నారోనన్న విషయాన్ని అందులో పేర్కొనడం మరచిపోవద్దు. ఒకే రకమైన భంగిమలు కూడా సెక్స్‌ జీవితానికి విరక్తి కలిగించవచ్చు. అందుకని కొత్త భంగిమల కోసం తరచూ ప్రయత్నించండి. సెక్స్‌ భంగిమలకు సంబంధించి పలు పుస్తకాలు మార్కెట్లో దొరుకుతున్నాయి. రెండు పుస్తకాలు కొని ఇద్దరూ ఒక్కో పుస్తకం చదవడం ద్వారా కొత్త విషయాలు తెలసుకుని మరింత ఆనందదాయకమైన సెక్స్‌ జీవితాన్ని అనుభవించవచ్చునని సెక్సాలజిస్టులు అంటున్నారు.

English summary
Experts say massage will paly an important role in sex life. Life partners should experiment with new techniques massage to prepare their partner for good sex. He/she should tell some romantic stories while participating in sex to his/her partner.
Story first published: Tuesday, February 8, 2011, 17:36 [IST]

Get Notifications from Telugu Indiansutras