ముద్దులకు ముందు, ముద్దులకు తర్వాత 15 జంటలను ఎంపిక చేసుకుని ఉత్పత్తి చెందే ఆక్సీటానిక్ అలాగే కోర్టీసోల్ హార్మోన్లు శాతాన్ని ఆ మధ్య పరిశోధనల్లో లెక్కవేశారు. ముద్దుల తర్వాత ఆ జంటల్లో ఆక్సీటానిక్ హార్మోను ఇరువురిని దగ్గరకు చేరుస్తుందని, దీని శాతం పెరిగిందని అలాగే కోర్టీసోల్ హార్మోన్ శరీరంలో వేడిని పుట్టించి కామోద్దీపనాన్ని మేల్కొల్పుతుందని తేలినట్లు పరిశోధకులు తేల్చారు.
ముద్దుల వల్ల మనుషుల్లో మార్పులు, ఉత్తేజం కలగడం, మస్తిష్కంలో తీవ్రమైన ఒత్తిడి పెరిగి మనసు ఆనందడోలికల్లో తేలియాడుతుంది. దీంతో సెక్స్ కోరికలు విచ్చుకుంటాయని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. చుంబనాల వల్ల మీలోని హార్మోన్లు మీ పార్టనర్ శరీరంలోకి ప్రవేశించి ఇద్దరిలోనూ ఆ ప్రభావం వుంటుందంటున్నారు పరిశోధకులు. ఇది కేవలం రెండు పెదవుల స్పర్శ వల్ల మస్తిష్కంలో తీవ్రమైన అలజడి రేగి ఉద్వేగం చెలరేగుతుంది. ఈ చుంబనాలపై పరిశోధనలు చేసిన పరిశోధకులు హార్మోన్ల ప్రభావమేనని తేల్చిచెప్పారు.