•  

సెక్స్‌లో అంగస్తంభన సమస్య ఎందుకు?

Kamasutra-Srungaram
 
కొత్తగా పెళ్లి చేసుకున్న యువకులకు శోభనం రాత్రికి ముందు నుంచే పలు రకాల అపోహలు మనస్సును తొలుస్తుంటాయి. ముందస్తు అనుభవం లేదనో, అంగస్తంభన సజావుగా సాగుతుందో లేదోననో, ఒకవేళ యోని ప్రవేశం సక్రమంగా చేసినా ఎక్కువ సేపు సమయం సెక్స్‌లో పాల్గొంటామో లేదోననో ఇలాంటి అపోహలు వారిని వేధిస్తుంటాయి. మరికొంత మంది యువకుల్లో అంగస్తంభించిన కొద్ది సేపటికే మెత్తబడి పోతుంది. ఇలాంటి వాటితో ఆందోళన చెందే యువకులు పెళ్లికి ముందు ఉండే సమస్యలే కారణమని భావిస్తుంటారు. నిజానికి రత్రిక్రీడకు ఇలాంటి వాటికి ఎలాంటి సంబంధం లేదని వైద్యులు చెపుతున్నారు. ఇందుకు ఎన్నో ఉదహరణలు చెప్పుకోవచ్చు.

కొంతమందికి పైల్స్ సమస్య ఉంటుంది. ఇది కూడా సెక్స్‌కు ఓ కారణమని కొందరు భావిస్తుంటారు. అయితే, దీనివల్ల ఎలాంటి సమస్య తలెత్తదని వైద్యులు అంటున్నారు. సాధారణంగా సెక్స్‌లో పాల్గొనే ముందు మీరు ప్రశాంతంగా ఉండాలి. శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఇది ఎంతో ముఖ్యం.ఈ రెండు ఉన్నట్టయితే అంగస్తంభించిన కొద్ది సేపటికే మెత్తబడి పోతుంది. ఈ సమస్య పరిష్కారం కావాలంటే ఎలాంటి మందులు వాడనవసరం లేదని, కడుపు నిండా ఆరగించి, హాయిగా నిద్రపోతే సమస్యకు ఇదే పరిష్కారమని సెక్స్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా, సెక్స్‌లో పాల్గొనే ముందు మానసికంగా హుషారుగా ఉండాలి.

భోజనం చేసిన వెంటనే సెక్స్‌‍లో పాల్గొనరాదని వైద్యులు హితవు పలుకుతున్నారు. అంతేకాకుండా, భార్యను ఎక్కువ సంతృప్తి పరచాలని, ఆనందం ఇవ్వాలని అత్యుత్సాహం చూపే యువకులకు సైతం అంగస్తంభన సమస్య ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెపుతున్నారు. దీన్ని అధిగమిస్తే మీకు ప్రతి రాత్రే సుఖరాత్రే అవుతుందని చెబుతున్నారు.

Story first published: Tuesday, February 1, 2011, 17:20 [IST]

Get Notifications from Telugu Indiansutras