పైగా దానిని ఫ్రెండ్‌షిప్‌గా అభివర్ణించడం మామూలైపోయిట్లు తేలింది. లండన్‌కు చెందిన ఈ అధ్యయన బృందం చేపట్టిన సర్వేలో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. వివాహమైన ప్రతి ఐదుగురు పురుషుల్లో ఒకరు వివాహేతర సంబంధాన్ని కలిగి ఉన్నట్లు వెల్లడైంది. ఇక మహిళల విషయాన్ని చూస్తే పదిమంది మహిళకు ఒక మహిళ వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నట్లు తేలింది.
ఈ సంబంధాన్ని కలిగి ఉండటం వారు తప్పుగా భావించడం లేదని తేలడం మరీ ఆశ్చర్యకరం.ఇదిలావుంటే వివాహమైన ప్రతి 20 మంది పురుషుల్లో ఒకరు తనకిష్టమైన మహిళతో సంబంధం పెట్టుకునేందుకు తహతహలాడుతున్నారట. వీరి వ్యవహారంలో అవతలి స్త్రీ వివాహేతర సంబంధానికి విముఖత చూపడంతో వారి ప్రయత్నాలు సఫలం కావడం లేదని సర్వే వివరాలు వెల్లడిస్తున్నాయి. స్త్రీ- పురుషుల సాన్నిహితత్వం కారణంగా ఇటువంటి సంబంధాలు ఎక్కువవుతున్నాయనీ, స్నేహం పేరుతో అవతలి వ్యక్తిని ఏదోవిధంగా అక్రమ సంబంధాలకు ఒప్పిస్తున్నట్టుగా తెలుస్తోంది.