ఫేస్ బుక్, టెక్స్టింగ్ వంటి సోషల్ నెట్‌వర్కింగ్ సాధనాలు నూతన దంపతులను అతి వేగంగా పడక గదికి నడిపిస్తాయని ఇటీవలి ఓ సర్వేలో తేలింది. షేప్ అండ్ మెన్స్ ఫిట్నెస్ మాగజైన్లు ఇటీవల మూడో వార్షిక సెక్స్ సర్వేను నిర్వహించాయి. ప్రతి ఐదుగురు పురుషుల్లో నలుగురు, ప్రతి ఐదుగురు స్త్రీల్లో ముగ్గురు డిజిటల్ సాన్నిహిత్యం వల్ల వేగంగా సెక్స్‌ వైపు కదిలినట్లు సర్వేలో తేలింది. స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్‌కు బెడ్రూంకు దారి తీయించే నూతన సాధనాలని అంటున్నారు.
సోషల్ మీడియా సాధనాలు వేగంగా సెక్స్ వైపు కదిలిస్తాయని 80 శాతం మంది స్త్రీలు, 58 మంది స్త్రీలు అభిప్రాయపడ్డారు. టెక్స్టింగ్ లవర్స్‌ను ఎల్లవేళలా టచ్‌లో ఉంచుతున్నాయి. మెసేజ్‌ల ద్వారా, ఫేస్ బుక్‌ల ద్వారా నిరంతరం టచ్‌లోకి వస్తున్నట్లు తేలింది.