•  

డ్రగ్స్ సెక్స్ శక్తిని పెంచుతాయా?

Sex power increases with Drugs
 
మత్తు పదార్థాలను తీసుకోవడం వల్ల సెక్స్ సామర్థ్యం పెరుగుతుందనీ, అంగస్తంభన ఎక్కువ సేపు ఉంటుదన్నదని కొంత మంది భావిస్తారు. కానీ అది అపోహ మాత్రమేనని సెక్సాలిజిస్టులు అంటున్నారు. మత్తు పదార్థాలను "ఎక్టసీ" అని "లవ్ డ్రగ్" అని ఇంగ్లీషులో పిలుచుకుంటారు. ఈ పదార్థాన్ని తినడం వలన, పొగ పీల్చడం వలన, దాని ప్రభావం శరీరంలో సెరటోనిన్ హార్మోన్ విడుదలై ఏదో తెలియని ఆనందం తెస్తుంది. ఆ మత్తుమందు ప్రభావం తగ్గేసరికి తిరిగి భయం, ఆందోళన, డిప్రెషన్ ఏర్పడతాయి.

పైగా వీటిని ఉపయోగించేవారు ఏ పనిపైనా మనసు లగ్నం చేయలేరు. అర్థం లేని కలలు వస్తుంటాయి. కండరాల నొప్పులు, వాంతులు, ఆ పిదప వణుకుడు రోగం కూడా తగులుకుంటుంది. శరీరంలోని నీరు లాగేయడం వల్ల విపరీతమైన దాహం కలుగుతుంది. ఈ అలవాటు అలాగే కొనసాగిస్తే ప్రాణం మీదికి వస్తుంది.

Story first published: Saturday, January 8, 2011, 17:03 [IST]

Get Notifications from Telugu Indiansutras