వివాహమై వయస్సు పెరిగినవారిపై ఈ అధ్యయనం జరిగింది. సెక్స్ చేసే సమయంలో భాగస్వాములు ఒకరిలో మరొకరు లీనమైపోవడం కన్నా మించిన లైంగిక ప్రోత్సాహకం మరోటి ఉండదని చెబుతున్నారు. భాగస్వాముల మధ్య సంబంధం ఎంత లోతుగా అనేది ముఖ్యంగా పనిచేస్తుంది. ఇరువురి మధ్య సాన్నిహిత్యంపై కూడా శృంగారానుభవం ఉంటుందని ఆ అధ్యయనంలో తేలింది. భాగస్వాముల పరస్పరం శారీరక స్పందనలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. శృంగారంలో పాల్గొనే సమయంలో ఉద్వేగభరితమైన కాంక్షతో నగ్నం కావడం, పరస్పరం పంచుకోవడం వంటి కారణాలు బాగా ఉపకరిస్తాయని అధ్యయనంలో తేలింది. భాగస్వామికి స్వచ్ఛందంగా లొంగిపోవడం ఇందులో ప్రధానమైన అంశం.
సెక్స్‌ను సంపూర్ణంగా అనుభవించడానికి వయగ్రా, సెక్స్ బొమ్మలు, కామసూత్ర భంగిమలు అవసరం లేదని, మానసికమైన అంశమే ముఖ్యమని ఇటీవలి ఓ అధ్యయనంలో తేలింది. పాప్ కల్చర్ నమ్మకాలకు భిన్నమైన విషయాన్ని మావన లైంగికత్వంపై కెనడియన్ జర్నల్‌లో ప్రచురించిన ఓ అద్యయనం బయట పెట్టింది. భాగస్వాముల మధ్య ఉద్వేగభరితమైన సంబంధం, కమ్యూనికేషన్, ఫోకస్ ఉంటే చాలునని ఆ అధ్యయనం చెబుతోంది.