•  

అవి సెక్స్ లైఫ్‌ను దెబ్బ తీస్తాయట

Kamasutra
 
రోమాంటిక్ కామెడీలు సెక్స్ లైఫ్‌ను దెబ్బ తీస్తాయని పరిశోధకులు అంటున్నారు. రోమాంటిక్ కామెడీలు ఎక్కువగా చూసేవారి శృంగార జీవితంలో నిరుత్సాహం అలుముకునే ప్రమాదం ఉందని అంటున్నారు. ఊహాజనిత అంచనాల వల్ల వాస్తవికతకు దూరమై దంపతుల మధ్య శృంగార జీవితం దెబ్బ తింటుందని అంటున్నారు. ఎడిన్‌బర్గ్ విశ్వవిద్యాలయం మానసిక శాస్త్రవేత్తలు ఆ విషయం తేల్చారు. రోమాంటిక్ కామెడీలు ఎక్కువ చూసేవారు కాల్పనిక ప్రపంచంలో విహరిస్తారని, వాటి ప్రభావంతో తమ జీవిత భాగస్వాములతో విషయాలను పంచుకోవడంలో విఫలమవుతారని, పరిపక్వమైన ఊహాజనిత ప్రపంచంలోని సంబంధాలను కోరుకుంటారని, అయితే జీవిత వాస్తవికత సినిమాలకు భిన్నంగా ఉంటుందని వారు చెబుతున్నారు. దాంతో వారు అసంతృప్తికి లోనవుతారని తేల్చారు.

1995 నుంచి 2000 వరకు వచ్చిన సినిమాల్లో 40 సినిమాలను పరిశోధకులు అధ్యయనం చేశారు. స్టీరియోటైప్ లవ్ మోటివ్స్‌తోనే చాలా సినిమాలున్నాయని, వాటికి వాస్తవికతతో సంబంధం లేదని, అటువంటి సినిమాలను ఎక్కువగా చూసేవారు ఊహాజనితమైన ప్రేమను ఆశిస్తారని, అది లభించక అసంతృప్తికి గురవుతారని అంటున్నారు. పర్ఫెక్ట్ మ్యారేజీ, లైంగిక జీవితం వాస్తవికతలో సాధ్యం కాదని చెబుతున్నారు. రోమాంటిక్ కామెడీల ప్రభావం పడినవారు విషయాలను జీవిత భాగస్వాములతో సరిగా చెప్పలేక సతమతమవుతారని అంటున్నారు. వాస్తవ పరిస్థితుల మీద ఆధారపడి మాత్రమే దంపతులు సెక్స్ జీవితాన్ని గడపాలని సలహా ఇస్తున్నారు.

Story first published: Wednesday, January 26, 2011, 16:36 [IST]

Get Notifications from Telugu Indiansutras