మహిళలలో భావప్రాప్తి కొరకు ప్రత్యేకంగా జీ స్పాట్ అనే బిందువు ఏదీ ఉండదని తేలిందని, దీనికిగాను జీ స్పాట్ విషయంపై పరిశోధనలు జరిపేందుకు తాము 1800 మంది మహిళలను భాగస్వాములను చేశామన్నారు. తాము పరిశోధనలు చేసేందుకు ప్రత్యేకంగా కవలలను ఎంచుకున్నామని, ఎందుకంటే జీ స్పాట్ అనేది వారిలోంచి ఒకరిలో ఉంటే మరొకరిలోనూ ఉండాలన్నారు. కారణం కవలలో ఒకే రకమైన జీన్స్ ఉంటాయి. కాని ఇలాంటిది ఇక్కడ తమ పరిశోధనల్లో తేలలేదని ప్రొఫెసర్ టిమ్ తెలిపారు. తమ పరిశోధనల ద్వారా తెలిసిన విషయం ఏంటంటే భావ ప్రాప్తి అనేది కేవలం వారి వారి మానసికపరమైన ఆనందాలకు నిలయమేననేది తప్ప మరోటి కాదని పరిశోధకులు స్పష్టం చేశారు.
మహిళలకు సుఖ ప్రాప్తినిచ్చేది జీ స్పాట్ అని చాలా మంది పురుషుల్లో ఓ అపోహ ఉంది. అసలు జీ స్పాట్ అనేది లేదంటున్నారు పరిశోధకులు. ఇదంతా కేవలం వారి భ్రమేనంటున్నారు పరిశోధకులు. తాము చాలా మంది మహిళలను పరీక్షించామని ఇలాంటి స్థానం అంటే జీ స్పాట్ కొరకు వెతికామని, కాని వారిలో ఇలాంటి స్థానం ఏదీ లేదని తమ పరిశోధనల్లో తేలినట్లు లండన్‌కు చెందిన ప్రముఖ కింగ్స్ కాలేజ్ శాస్త్రజ్ఞులు ప్రొఫెసర్ టిమ్ స్పెక్టర్ జర్నల్ ఆఫ్ సెక్సువల్ మెడిసన్ అనే పత్రికలో పేర్కొన్నారు.