22 శాతం సంబంధం స్థిరంగా, 20 శాతం సంతృప్తికరంగా ఉన్నట్లు సర్వేలో తేలింది. శృంగార నాణ్యత 15 శాతం మెరుగ్గా ఉన్నట్లు కూడా తేలింది. 12 శాతం కమ్యూనికేషన్ బాగుందట. శృంగారం కోసం ఎక్కువ కాలం నిరీక్షించిన దంపతులు ఆ తర్వాత సెక్స్‌ను ఎక్కువగా ఎంజాయ్ చేశారట. సమస్యలపై స్పష్టంగా మాట్లాడుకునే అవగాహన వచ్చి సెక్స్ లైఫ్ కూడా బాగుంటుందని సర్వే చేసినవారుంటున్నారు.
పెళ్లి తర్వాత సెక్స్ కోసం తహతహలాడకపోవడం మంచిదని ఓ సర్వేలో తేలింది. మూడు ముళ్ల బంధం నూరేళ్ల పంటగా మారాలంటే దంపతులు శృంగారాన్ని కొద్ది రోజులు దూరంగా పెట్టాలని సర్వే ఫలితాలు తెలియజేస్తున్నాయి. వివాహ బంధం చక్కగా కొనసాగాలంటే, దాంపత్య సంబంధం గట్టిపడాలంటే పడక గదికి ఇద్దరు కొద్ది రోజులు దూరంగా ఉండాలని అంటున్నారు. సర్వేకు 2,035 మంది దంపతులను సర్వే కోసం ఎంచుకున్నారు. పెళ్లి వరకు సెక్స్ చేయకుండా నిరీక్షించినవారి మధ్య, పెళ్లి తర్వాత కొద్ది రోజులు వెయిట్ చేసినవారి మధ్య సంబంధాలు బాగున్నట్లు సర్వేలో తేలింది.