వాటి వల్ల పురుషుల్లో లైంఘిక పరమైన సమస్యలు తలెత్తుతాయి. దీనికి మానసికంగా కూడా మరింత కృంగి పోయే అవకాశాలు చాలా ఉన్నాయి. దీనికి తోడు ఆహారంలో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండేవి తీసుకోవడం ద్వారా ఈ సమస్యను మరింత ఎక్కువ చేస్తుంది. దీని వల్ల శృంగారంపై అయిష్టత, అంగ స్తంభన సమస్యలు, జీవన శైలికి అడ్డంకిగా మారుతాయి. ముందుగానే మేలుకుని సరైన కాలంలో శరీరానికి సరిపడ వ్యాయామాన్ని అందిస్తూ, కొవ్వు పదార్థాలు అధికంగా ఉండే ఆహారాన్ని తక్కువగా తీసుకంటూ ఉంటే సరిపోతుంది. అయితే కొవ్వు పదార్ధాలను మానుకోలేని వారు ఆవి తింటూ కూడా దానికి సరిపడ వ్యాయామాన్ని చేయడం మంచిది.
ప్రపంచ వ్యాప్తంగా పురుషుల్లోను, స్త్రీల్లోను ఎన్నో రకాలైన శృంగార సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే వారిలో పురుషులే అధికంగా శృంగారానికి సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. పురుషుల్లో 40 ఏళ్లు దాటిన వారు 35 శాతం వరకు శృంగార సమస్యలు ఎదుర్కొంటున్నారనేది వాస్తవం. వయసు పైబడడంతో పాటు యవ్వనంలో ఉన్నప్పుడు ఆహారపు అలవాట్లు, సరైన వ్యాయామం లేకపోవటం వంటి వాటితో పాటు మానసిక పరమైన సమస్యలు వెరసి పురుషుడు 40 ఏళ్లు వచ్చే సరికి మధుమేహం, గుండెకు సంబంధించిన జబ్బులు, అధిక రక్తపోటు, స్థూల కాయం వంటి వివిధ సమస్యలతో సతమతమవుతున్నారు.