యుక్తవయస్సులో అటువంటివన్నీ సహజమేనని తల్లిదండ్రులు తమ పిల్లలకు తెలపాలి. సెక్స్‌పై పూర్తి అవగాహనను కలిగించి, హద్దులు పాటించకపోతే దుష్పరిణామాలు ఎదురవుతాయని చెప్పాలి. సహజమైన, ఉద్వేగజనితమైన సెక్స్ పట్ల ఉదాసీనత మంచిది కాదంటారు సెక్సాలజిస్టులు. యవ్వనంలోకి తొలి అడుగులు వేసిన పిల్లలకు లైంగిక విజ్ఞానాన్ని తప్పనిసరిగా బోధించాలి. ఈ బాధ్యతను ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు తీసుకుని తాము నిర్వహించే కార్యక్రమాలలో ప్రస్తావిస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఇక తల్లిదండ్రులు సైతం యవ్వనవంతులైన తమ పిల్లలతో స్నేహితుల్లా మెలగుతూ యవ్వనంలో వచ్చే మార్పులను తమ పిల్లలకు వివరించి చెప్పాలి.
తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య స్నేహపూర్వక, స్వేచ్ఛాయుతమైన వాతావరణం ఉంటే భావప్రకటనా స్వాతంత్ర్యం పెరిగి సెక్స్‌కు సంబంధించి ఎటువంటి సందేహాన్నైనా పిల్లలు తల్లిదండ్రులతో చర్చించే అవకాశం ఉంటుంది. దీనివల్ల వారిలో సెక్స్ కోరికలు చేసే అలజడికి అడ్డుకట్ట వేయడమే కాక లైంగిక సుఖాన్ని.. ఎప్పుడు, ఎలా అనుభవించాలో అర్థమవుతుంది.