సెక్స్ తో జీవిత కాలం పెంపు

Regular Sex will increase Life Span
 
సెక్స్- దీర్ఘాయువును ప్రసాదించే ఓ దివ్యౌషధమని సెక్సాలజిస్టులు అంటున్నారు. పడకగదిలో సెక్స్ సుఖాన్ని అనుభవించిన జంటల్లో శరీరాన్ని పటిష్టపరిచే హార్మోన్ల విడుదల ఉంటుందంటున్నారు. ఈ హార్మోన్ల వల్ల శరీరానికి కొత్త శక్తి వచ్చి చేరుతుంది. ఈ విషయాన్ని అలనాడు వాత్సాయనుడు చెప్పినప్పటికీ వాటిని అర్థం చేసుకుని ఆచరించడానికి నేటికీ చాలామంది జంకుతున్నారనీ, అయితే ఆధునిక కామశాస్త్రం సెక్స్ వల్ల ఒనగూరే లాభాలను మరింత విపులీకరిస్తోందని చెపుతున్నారు.

పెద్దలలో దాదాపు అన్ని అనారోగ్యాలను అదుపులో పెట్టగల శక్తి సెక్స్‌కు ఉంది. కనీసం వారంలో ఒక్కసారి సెక్స్‌లో పాల్గొనేవారిలో అనారోగ్య సమస్యలు చాలా అరుదుగా తలెత్తుతాయంటున్నారు. సెక్స్‌లో రెగ్యులర్‌గా పాల్గొనేవారిలో క్యాలరీల ఖర్చు అధికమవుతుంది. ఫలితంగా అధిక బరువు, ఇతర సమస్యలు తలెత్తవు. అదేవిధంగా జీర్ణశక్తి బాగా మెరుగవుతుంది. గాఢమైన నిద్ర పడుతుంది. ఒత్తిడి, చికాకులన్నీ దూరమై ప్రశాంతమైన జీవనాన్ని అందిస్తుంది.

తలనొప్పి, పార్శ్వనొప్పి వంటివాటికి సెక్స్ ఔషధంగా పనిచేస్తుందంటున్నారు. సెక్స్‌లో భావప్రాప్తి దశకు చేరుకునే ముందు ఆక్సిటోసిన్ హార్మోన్ స్థాయి ఐదు రెట్లు పెరుగుతుంది. దీంతో ఎండార్ఫిన్లు విడుదలై తలనొప్పి, ఇంకా ఇతర నొప్పులను పారదోలతాయి. వారంలో రెండు లేదా మూడుసార్లు సెక్స్‌లో పాల్గొనే జంటల్లో రోగనిరోధక శక్తి అధికమవుతుంది. తేలికగా శరీరంలోకి చొరబడే జలుబు, ఫ్లూ కారక వైరస్‌లను అడ్డుకునే శక్తిని కలిగి ఉంటారు.

Story first published: Tuesday, December 28, 2010, 16:39 [IST]
Please Wait while comments are loading...