స్మోకింగ్ చేయటం వల్ల సెక్స్ కోరికలు తగ్గిపోతాయా అనే సందేహం పలువురికి వస్తుండడం సహజం. ఆ సందేహాన్ని వైద్యుల వద్ద తేల్చుకోవడానికి కూడా ప్రయత్నిస్తుంటారు. అయితే పొగతాగేవారిలో సెక్స్ కోరిక ఎంత మాత్రం తగ్గదంటున్నారు వైద్యులు. సెక్స్‌పై స్మోకింగ్ ప్రభావం ఎలా ఉన్నప్పటికీ ఆరోగ్యం మీద దుష్ఫలితాలు ఎక్కువగా కనబడతాయి.
స్మోకింగ్ చేయటం వల్ల గుండెపోటు రావటం, కడుపులో పుళ్లు ఏర్పడటం, బ్రోంఖైటిస్ వంటి వ్యాధులతో ఇబ్బందిపడటం, లంగ్ కేన్సర్ వంటి శ్వాసకోస సమస్యలు తలెత్తవచ్చు. అంతేకాదు రక్తనాళాలు సైతం గట్టిగా మారతాయి. రక్తనాళాలు గట్టిపడిన వారిలో అంగస్తంభనలు తృప్తికరంగా వుండవని వైద్యులు చెపుతారు. అందువల్ల స్మోకింగ్ ప్రత్యక్ష సెక్స్ జీవితంపై ప్రభావం చూపకున్నా పరోక్షంగా తీవ్ర ప్రభావం వేస్తుందని అర్థమవుతోంది.