•  

భావప్రాప్తిని స్త్రీ ముఖం చెప్పగలదా?

Women face indicate the satisfaction
 
ఒక్కో భావోద్రేకానికి ఒక్కో రకంగా ముఖకవళికలు మారుతుంటాయి. అయితే దాంపత్య జీవితంలో సంతోషం, బాధ కలిగే సమయాలలో ముఖకవళికలు ఎలా ఉంటాయన్న విషయంపై అల్బ్రైట్ యూనివర్సిటీ పరిశోధకులు జరిపిన అధ్యయనంలో పలు ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. తమ పరిశోధనల్లో భాగంగా స్త్రీ పురుషుల కలయిక సందర్భంగా తీసిన, ముఖ్యంగా ముఖకవళిలను ప్రతిబింబించే విధంగా తీసిన 91 మంది జంటల ఫోటోలను ఇంటర్నెట్ ద్వారా అధ్యయనం చేసినట్లు ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన అల్బ్రైట్ యూనివర్సిటీ సైకాలజీ ప్రొఫెసర్ సుసాన్ హ్యూజెస్ తెలిపారు.

అంతులేని ఆనందం అనుభవించే భావప్రాప్తి సమయంలోనూ, తీవ్రమైన నొప్పితో బాధపడే సందర్భంలోనూ ముఖంలో ఒకేమాదిరి భావోద్వేగాలు ఉంటున్నట్లు గుర్తించామని సుసాన్ పేర్కొన్నారు. అంతేగాకుండా, ఆడవారి ముఖంలో కనిపించే బాధను మరో మహిళ మాత్రమే చాలా స్పష్టంగా గుర్తించగలుగుతుందని తాము కనుగొన్నట్లు సుసాన్ వెల్లడించారు. మహిళల్లో భావప్రాప్తిని గుర్తించటంలో మాత్రం మగవారిదే అందెవేసిన చెయ్యి అని కూడా ఈ అధ్యయనం ద్వారా వెల్లడైందని ఆమె తెలిపారు.

Story first published: Tuesday, December 21, 2010, 16:35 [IST]

Get Notifications from Telugu Indiansutras