•  

మాత్రలు వాడితే సెక్స్ కోరిక తగ్గుతుందా?

Sexual Interest
 
చాలామంది మహిళలు గర్భ నిరోధక మాత్రలు ఈమధ్య ఎక్కువగా వాడుతున్నారు. ఇలా మహిళలు గర్భ నిరోదక మాత్రలు వాడితే సహజసిద్దమైన శృంగార కోరికలు వారిలో చల్లారిపోతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.శాస్తవేత్తలు చెప్పనట్టుగా జర్నల్ ఆఫ్ సెక్సువల్ మెడిసిన్ అనే పత్రిక కథనాన్ని ప్రచురించింది. రతిక్రియ ద్వారానే స్త్రీలు తమ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టిని సారిస్తారని, వారు ఎంతో చలాకీగా తమ పనులు పూర్తి చేసుకుంటుంటారని ఓ డాక్టర్ చెప్పారు. అదే వారు నిత్యం గర్భ నిరోధక మాత్రలు వాడుతుంటే వారిలో సెక్స్ కోరికలు చచ్చిపోతాయని, దాంతో వారు ఏదో కోల్పోయినట్లు ఉంటారని చెప్పారు. ఆ కారణంగా మహిళలు తమ పనుల్లో శ్రద్ధ కనబరిచలేరని పరిశోధనలో తేలినట్లు చెప్పారు.

మహిళలు గర్భ నిరోధక మాత్రలు వాడటం ఓ రకమైన వ్యాధిగా కొందరు భావిస్తుంటారని పేర్కొన్నారు. గర్భణీలు వాడే మాత్రల వల్ల చాలామంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుందన్నారు. గర్భ నిరోధక మాత్రలు వాడే స్త్రీలలో సెక్స్ కోరికలు తగ్గిపోతున్నట్లు తమ పరిశోధనల్లో తేలిందని ఆమె స్పష్టం చేసినట్లు ఆ పత్రిక వెల్లడించింది. ఇదిలావుండగా కండోమ్‌లలాంటి సురక్షితమైన గర్భ నిరోధక సాధనాలకు బదులుగా హార్మోన్లతో కూడుకున్న గర్భ నిరోధక మాత్రలు వాడే మహిళల్లో సెక్స్‌పట్ల విముఖత చూపిస్తున్నట్లు మరో పత్రిక ది డైలీ టెలిగ్రాఫ్ తెలిపింది.

Story first published: Thursday, October 7, 2010, 17:34 [IST]

Get Notifications from Telugu Indiansutras