నొప్పులకు సెక్సే మందు

Sex will decrease body pains
 
సెక్స్ లో పాల్గొనాలంటే చాలామంది మహిళలు అనాసక్తి చూపుతుంటారు. ఉదయం నిద్రలేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు పలు పనులతో సతమతమౌతుండడమే అందుకు ప్రధాన కారణం. దీంతో వారికి శృంగారంపై ఆసక్తి తగ్గిపోతుంటుంది. పైగా భర్త సెక్స్ కు సన్నద్దమౌతున్నప్పుడే ఆహ్, ఊఁ, ఔచ్, నడుము నొప్పి, వెన్ను నొప్పి, మెడ నొప్పి, ఏదో ఒకటి చెప్పి తమ జీవిత భాగస్వామికి ఆ మూడ్‌ పోయేలా వ్యవహరిస్తుంటారు. కాని నొప్పులు మటుమాయమవ్వాలంటే సెక్స్ లో పాల్గొనడమే అత్యుత్తమమైన ఔషధమంటున్నారు పరిశోధకులు. కావాలనే మహిళలు ఇలా అంటారనుకోవడం పొరబాటు. సెక్స్ లో పాల్గొనాలనే కోరిక మహిళల్లోను ఉంటుంది. కాని పనుల ఒత్తిడి వలన శరీరం అలసిపోతుంది. దీంతో ఆ క్రియలో పాల్గొనాలనే కోరిక చల్లారిపోతుందంటున్నారు పరిశోధకులు. అధిక పని భారం వలన రాత్రి ఎప్పుడెప్పుడు నిద్రకుపక్రమిస్తామా అని మహిళల శరీరం నిద్రపోవాలని కోరుకుంటుంటుంది. కాబట్టి మహిళలు రాత్రి తమ జీవిత భాగస్వామితో రతిక్రియలో పాల్గొనేందుకు ముందుగానే మనసును సిద్ధం చేసుకుంటే ఆ క్రియలో మహిళలు చాలా ఉత్సాహంగా పాల్గొనగలుగుతారని పరిశోధకులు పేర్కొన్నారు.

తమ జీవిత భాగస్వామిని ఆ క్రియకు ప్రోత్సహించడంలో భాగంగా పురుషులు సన్నద్ధం కావాలి. దీనికి అనువైన కార్యకలాపాలు, సరస సల్లాపాలు, మృదువైన, మనసుకు హత్తుకునే నాలుగు ప్రేమ మాటలు మాట్లాడాలి. ఇంటికి రాగానే తరచూ మీ పనుల్లో మీరు బిజీ కాకూడదు. వారితోను కాసేపు ముచ్చటించాలి. వారు చేసే ఇంటి పనుల్లో మీరు తోడుగా కలిసి సహాయపడుతూ వారి మనసును గెలుచుకునేందుకు ప్రయత్నించాలి. అప్పుడే వారికి ఆ మూడ్ వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో ఉదయం నుంచి రాత్రి వరకు పడిన శ్రమ మర్చిపోయి పడక సుఖాన్ననుభవించేందుకు సిద్ధమౌతారు. ఎప్పుడైతే భార్యాభర్తలు ఇరువురూ మనస్ఫూర్తిగా సెక్స్ లో పాల్గొంటారో అప్పుడు శరీరంలోని మానసిక, శారీరక ఒత్తిడితోపాటు శరీరంలోనున్న నొప్పులు మటుమాయమౌతాయంటున్నారు పరిశోధకులు.

పని ఒత్తిడి వలన కొన్నిసార్లు నిద్ర సరిగా పట్టదు. అలాంటి సందర్భంలో చాలామంది మహిళలు కావచ్చు లేదా పురుషులు బెడ్‌పై పడుకుని అలా కాలం వెళ్ళబుచ్చుతుంటారు. మరోవైపు మీ జీవిత భాగస్వామి మంచి నిద్రలోవుంటారు. లేదా బాల్కనీలో అటూ ఇటూ తిరుగుతూ కాలం వృద్ధా చేస్తుంటారు. ఇలా కాలం వృద్ధా చేసేకన్నా మీ జీవిత భాగస్వామితో మంచిగా కబుర్లు చెబుతూ, ప్రేమగా వ్యవహరించండి. వీలైతే సంగీతం వింటూ సెక్స్ లో పాల్గొనేందుకు సన్నద్ధులవ్వండి. సెక్స్ లో పాల్గొన్నప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోను వ్యతిరేక భావనలను మనసులోకి రానివ్వకండి. సెక్స్ పూర్తయిన తర్వాత మీకు తెలియకుండానే నిద్ర ముంచుకు వస్తుంది. పైగా ఉదయం నిద్ర లేవగానే హుషారుగా ఉంటారు. దీంతో మీలోని ఒత్తిడి మటుమాయమౌతుంది.

Story first published: Monday, October 18, 2010, 16:48 [IST]
Please Wait while comments are loading...