నగర, పట్టణవాసులలోనే సెక్స్ సమస్య అధికంగా ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. నగరాలు, పట్టణాలలో నివశించే ప్రజలు, ముఖ్యంగా పురుషులు తమతమ పనులతో మహా బిజీగా ఉంటారు. తెల్లారింది మొదలు రాత్రయ్యేవరకూ సూరీడు కిరణాలు తగలని ఆఫీసు కార్యాలయాల్లోనే కాలం గడుపుతారు. రోజుకు కనీసం ఓ గంటపాటైనా శరీరంపై సూర్యరశ్మి సోకని పురుషులలో సెక్స్ సామర్థ్యం తగ్గిపోతున్నట్లు తేలింది.పూర్వకాలంలో సెక్స్ సత్తా లోపించిందని తెలిసినపుడు కామోద్రేకాన్ని కలిగించడానికి అప్పటికప్పుడు రెడీమేడ్‌గా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనివిగా ఉండే మూలికలు లభ్యమయ్యేవని పూర్వులు చెప్పేవారు. అంతేకాదు దీనికంటూ ఓ వ్యక్తి ప్రతి గ్రామంలోనూ లేహ్యాలతో కాపురముండేవాడు. అయితే క్రమంగా అది కలుషితమైన వ్యాపారం కావడంతో కనుమరుగైంది.
ఇక కామసూత్ర, రతీమన్మథుల మధ్య కామోద్దీపనకై వారు ఎటువంటి మార్గాలను అన్వేషించారో తెలుసుకునే సమయమూ తీరికా ఇప్పుడు లేకండా పోయింది. రోజూ కనీసం గంటకు తగ్గకుండా సూర్యరశ్మికింద శరీరాన్నుంచితే సమస్య పరిష్కారమవుతుందని చెబుతున్నారు. అదేవిధంగా చాలినంత నిద్ర తప్పనిసరి. ఇంకా పరిశుద్ధమైన గాలి వీచే ప్రదేశాన్ని చూసుకుని అక్కడ కనీసం ఓ అరగంటపాటు గడిపాలి. వ్యాయామం తప్పనసరి. ఇవన్నీ చేస్తే శరీరం కొత్త శక్తిని సంతరించుకుంటుంది. ఆదివారం శెలవురోజే కనుక ఆ రోజునాడు కనీసం మూడు నాలుగు గంటలు ఎండలో ఉండటాకి ప్రయత్నించాలట. నీరెండలో శరీరం చురుక్కుమనిపించేంత వరకు ఉండాలని చెబుతున్నారు.
Indiansutras - Get Notifications. Subscribe to Telugu Indiansutras.