•  

సెక్స్ అంటే ఇంతేనా

tension-sex
 
కాలేజీ కుర్రాళ్లు ఘాటైన ప్రేమ తాలూకు తీయని అనుభవాలను పంచుకునేందుకు ఇష్టపడుతుంటారు. అమ్మాయిలు కూడా అంతేనట. అలా మొదలైన కొందరి ప్రేమ ప్రయాణం పెళ్లితో ఓ స్దాయికి చేరుకుంటుది. ఆ తర్వాత సంసారంలో పడతారు. అందులో సెక్స్ ఓ భాగం. ఆధునిక కాలంలో ఈ సెక్స్ వాంఛను తీర్చుకోవాలనే ఆరాటం యువతీయువకుల్లో మితిమీరిన స్థాయిలో ఉంటున్నట్లు తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. మితిమీరిన సెక్స్ కోర్కెల తాలూకు ఆలోచనలతో పడక గదిలో అడుగు పెడుతున్న నూతన దంపతులు అనుకున్నంత స్థాయిలో తన భాగస్వామి నుంచి స్పందన రాలేదని వగర్చడం కూడా ఇటీవల కాలంలో ఎక్కువవుతున్నట్లు అధ్యయనంలో తేలింది. అప్పటివరకూ సెక్స్ అంటే ఏమిటో తెలియని వ్యక్తిని భాగస్వామిగా పొందినపుడు ఇటువంటి చేదు అనుభవం ఎదురవుతోంది. అయితే చాలా సందర్భాల్లో తాము అనుకున్న సెక్స్ పద్ధతులన్నిటినీ ఒక్క రాత్రిలోనే చేసేయాలన్న విపరీత ధోరణి వల్ల భాగస్వామికి చిక్కు వచ్చి పడుతోందట.

తొలి రాత్రి సెక్స్‌కోసం తహతహలాడే ఆధునిక జంటలు 16 రోజులు గడవగానే " సెక్స్ అంటే ఇంతేనా.." అనే భావనలో కొట్టుమిట్టాడుతున్నారు. దీంతో ఆ సుఖాన్ని వారంలో ఏదో ఒకరోజు అన్నట్లు కానించేస్తున్నారు. అంతేకాదు కొంతమంది ప్రేమగా దగ్గరకు వచ్చే భాగస్వామితో రోజూ అదేగా అన్నట్లు చూస్తుండటంతో ఆ కోరిక కాస్తా ఆవిరైపోతోంది. ఒత్తిడి చేసి సెక్స్‌కు ఉపక్రమిస్తే అది అత్యంత బాధాకరమైన ఓ అనుభవాన్ని మిగిల్చి ఆ తర్వాత మరో వారం రోజులు దాకా సెక్స్ అనే పదం దంపతుల మధ్య లేకుండా అయిపోతోందని అంటున్నారు. ఏ ఇద్దరి వ్యక్తుల్లోనో ఒకే స్థాయిలో సెక్స్ కోర్కెలు దాగి ఉంటాయి. అటువంటి స్త్రీపురుషులు వివాహమాడితే వారి సెక్స్ జీవితం సక్సెస్‌ఫుల్‌గా ఉంటుంది. కానీ చాలా సందర్భాల్లో ఒకే రకమైన సెక్స్ వాంఛలను కలిగి ఉన్న వ్యక్తులకు పెళ్లయ్యే సందర్భం చాలా తక్కువ. ప్రేమికులైనవారు పెళ్లితో ఏకమైనప్పటికీ వారి మనోభావాలు ఒకటైనప్పటికీ సెక్స్ దగ్గరకు వచ్చేసరికి భిన్న ధృవాలు కలిగిన మనస్తత్వాలుగా ఉంటున్నట్లు తేలింది. దీంతో మోజుపడి చేసుకున్న భార్య/భర్త తనకు పూర్తి స్థాయిలో సుఖాన్ని అందివ్వడం లేదని చిర్రుబుర్రులాడేవారు కూడా ఉన్నారు.

ఆ తర్వాత సెక్స్ చేసేటపుడు అనుసరించే పద్ధతులు. ఈ పద్ధతులు కూడా ఒకరికి కొన్ని రకాల పద్ధతులు మాత్రమే నచ్చితే, రెండో వ్యక్తికి ప్రత్యేకించి తను అత్యంత ప్రీతిపాత్రంగా తోచే సెక్స్ పద్ధతిని అనుసరించాలంటారు. ఫలితంగా చిన్నగా కీచులాట మొదలవుతుంది. ఆ తర్వాత అదే తీవ్రరూపం దాల్చి, ఆ పద్ధతి ఇష్టం లేదని చెపితే ఒకసారి అర్థం కాదా? అంటూ సెక్స్‌కు సమాయత్తమవుతున్న తరుణంలో భాగస్వామిపై విసుక్కోవడంతో ఆ వేడి కోరిక కాస్తా తుస్సుమంటుంది. చివరికి ఇరువురి మధ్య సెక్స్ గ్యాప్ ఓ పక్షం రోజులైనా ఉంటోంది. ఇటీవల కాలంలో టీనేజ్ దాటిన ప్రతి వ్యక్తిలో సెక్స్ గురించిన విజ్ఞానం ఎక్కువైంది. ఎక్కడ చూసిన సెక్స్ గురించిన కథనాలు దర్శనమివ్వడం దీనికి కారణం. ఆ విజ్ఞానాన్నంతా మెదడులో నింపుకుని భాగస్వామిపై ప్రయోగించాలనుకునేవారూ ఎక్కువవుతున్నారు. కానీ ఏదైనా క్రమేణా సాధ్యం చేసుకోవాలన్న విజ్ఞతను పక్కనపెట్టి తాము తెలుసుకున్నదే తడవుగా చేసేయాలని భాగస్వామిపైకి ఉరుకుతారు. అంతేతప్ప ఆ సమయంలో భాగస్వామి మనసు ఎలా ఉన్నదనే విషయానికి ప్రాధాన్యం ఇవ్వరు. ఫలితంగా సెక్స్ అనేది ఓ యాంత్రికమైన అనుభవాన్ని మిగుల్చుతుంది.

Story first published: Wednesday, October 13, 2010, 17:04 [IST]

Get Notifications from Telugu Indiansutras