•  

సెక్స్ కు నియమాలున్నాయా

Rules for Sex
 
సెక్స్ విషయంలో స్త్రీపురుషులు కొన్ని నియమాలు పాటించాలని అంటారు. ఏయే నియమాలు పాటించాలనే విషయంపై నిపుణులు కొన్ని సూచనలు చేశారు. సెక్స్ చేసే సమయంలో కొందరు ఆసనాల భంగిమలతో ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తుంటారు. ఆసనాల గురించి పూర్తిగా తెలుసుకోకుండా రతిక్రియలో వాటిని అమలు చేయకూడదంటున్నారు ఆరోగ్య నిపుణులు.కొందరు రతిక్రియ పూర్తయ్యిన వెంటనే నీటిని సేవిస్తుంటారు. ఈ పద్ధతి అంతమంచిది కాదు. రతిక్రియ పూర్తయ్యిన వెంటనే తీపిపదార్థాలు తీసుకోవాలి. వీటిలో ప్రధానంగా బెల్లం, కలకండ తదితర తీపి పదార్థాలు తీసుకోవాలంటున్నారు.

సెక్స్ పూర్తయిన తర్వాత వెంటనే చల్లటి గాలికి బయట తిరగకూడదంటున్నారు ఆరోగ్య నిపుణులు. అధిక వయసు కలిగిన స్త్రీ లేదా తక్కువ వయసు కలిగిన పురుషులతో రతిక్రియ జరిపకూడదు. అలాగే ఒకరికంటే ఎక్కువమంది స్త్రీలతో రతిక్రియ జరపకూడదని మన శాస్త్రాలు చెబుతున్నాయి. చాలామంది రతిక్రియలో తమను తాము బలహీనులుగా పోల్చుకుంటుంటారు. ఎందుకూ పనికిరానని అభిప్రాయపడుతుంటారు. ముఖ్యంగా తమ జీవిత భాగస్వామిని తృప్తి పరచలేమేమోనని తెగ బాధపడిపోతుంటారు. దీంతో మిత్రుల సలహా మేరకు వివిధ రకాల ఔషధాలను సేవిస్తుంటారు. అలా భావించినప్పుడుస నిజంగానే రతిక్రియ చేయడంలో బలహీనులనిపించినప్పుడు మాత్రమే యోగ్యుడైన వైద్యుడిని సంప్రదించి సలహాలు, సూచనలు పాటించి తగిన మందులు వాడాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Story first published: Saturday, October 9, 2010, 16:01 [IST]

Get Notifications from Telugu Indiansutras