మిచిగాన్ యూనివర్శిటీకి చెందిన డానియల్ బృందం ఈ అధ్యయన వివరాలను వెల్లడించింది. ఆ అధ్యయనం ప్రకారం - సెక్స్‌లో మహిళ భావప్రాప్తి చేరుకుని పూర్తి సంతృప్తిని వ్యక్తపరిచే వరకూ పురుషుడు రతి చేస్తూనే ఉంటాడు. ఏ పురుషుడైతే సెక్స్ ‌లో తనను శృంగారపు అంచులదాకా తీసుక వెళ్లి తీయనైన అనుభూతిని కలిగిస్తాడో అతడే సెక్స్‌లో పూర్తి సామర్థ్యమున్న పురుషునిగా మహిళ చూస్తుంది. అతనికి సెక్స్ సామర్థ్యం కావలసినంత ఉన్నదని మహిళ విశ్వసిస్తుందని తేలింది.
అయితే మహిళను భావప్రాప్తికి చేర్చేందుకు పురుషుడు చాలా కష్టపడతాడంటున్నారు సెక్సాలజిస్టులు. అంతేకాదు ఇలా భాగస్వామిలో సెక్స్ అమితానందాన్ని చూసేంతవరకూ విశ్రమించని పురుషుల మానసిక స్థితి చిత్రంగా కూడా ఉంటుందంటున్నారు. ఒకసారి సెక్స్‌లో విఫలమైనట్లు భావిస్తే తిరిగి తన భాగస్వామిని పూర్తిగా సంతృప్తి పరచే వరకూ ఓ పట్టాన వదలరు.అయితే వీర్య పునరుత్పత్తి శక్తి స్థాయిని బట్టి మహిళను సెక్స్‌లో తృప్తి పరచడం ఆధారపడి ఉంటుందంటున్నారు. అయినప్పటికీ రతి సుఖాన్ని పూర్తి స్థాయిలో తన భాగస్వామి చేత ఆస్వాదింపజేసేంత వరకూ పురుషుడు వదిలిపెట్టడు.
ఎంతచేసినా భాగస్వామికి తృప్తి కలుగలేదని తెలుసుకున్న పురుషుల్లో కొంతమంది పెడదోవ పడుతున్నట్లు తేలిందన్నారు. తనకు నిజంగా సెక్స్ సామర్థ్యం లేదేమోనన్న అనుమానంతో మరో మహిళతో అక్రమ సంబంధాన్ని నెరపుతూ అక్కడ తమ సామర్థ్యాన్ని చూసుకునే విపరీత ధోరణిని కలిగి ఉంటున్నారు. అవసరమైతే మరికొందరు మహిళలతో సైతం రతిలో పాల్గొని తన సామర్థ్యాన్ని రుజువు చేసుకునేందుకు తాపత్రయ పడుతుంటారు. మొత్తమ్మీద సెక్స్ పట్ల స్త్రీ పురుషుల్లో అవగాహన ఇంకా కలిగించాల్సి ఉందని తమ అధ్యయనం రుజువు చేస్తోందంటున్నారు పరిశోధకులు.