సెక్స్ మిస్సవుతున్నారా?

Are you missing Sex?
 
ఉదయం లేచిన దగ్గర్నుంచి స్త్రీ, పురుషులకు తీరికలేని పని ఒత్తిడి. రాత్రి పడకగదికి చేరేసరికి నీరసం, నిస్సత్తువ. దాంతో భార్యాభర్తల బెడ్ టైమ్ కాస్తా డిమ్ కాంతిలో మరింత డిమ్ముగా మారిపోతుంది. శృంగారానికి ఆరాట పడాల్సిన భార్యాభర్తలు అలసిపోయి నిద్రలోకి జారుకోవడం, మరుసటి రోజు, గత రాత్రి మిస్ చేశామనే బాధ...మళ్లీ వారి వారి పనులకు ఉరుకులు పరుగులు. ఇటువంటి నిస్సారమైన పడక గది రాత్రులకు చెక్ పెట్టవచ్చంటున్నారు దాంపత్య నిపుణులు. దీనికిగాను భార్యభర్తలు చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చాలంటున్నారు.

* వారంలో కనీసం ఒక్కసారి భాగస్వామితో ఓ మంచి రొమాంటిక్ సినిమాను కలిసి చూడండి. ఆ సినిమాలోని కొన్ని శృంగారభరిత సన్నివేశాలు మనసులను రొమాంటిక్ మూడ్‌కి తెస్తాయి.

* పడక గదికి చేరిన తర్వాత రోజువారీ భాగస్వామితో నెరపే శృంగార చేష్టల్లో ఒక కొత్తదనాన్ని చూపించండి.

* మీకు బాగా రొమాంటిక్ మూడ్స్‌ను తెప్పించే మంచి రొమాంటిక్ నవలలను ఎంచుకుని వాటిని కలిసి చదవండి. అయితే దీనికి పావుగంటకు మించి ఎక్కువ సమయం కేటాయించవద్దు.

* కలిసి స్నానం చేయడం వల్ల శృంగార రాజ్యంలో సంతృప్తిని పొందవచ్చు.

* ఆదివారాలు కూడా పనితో సతమతమయ్యేవారు మీ భాగస్వామికోసం ఆఫీసుకు నెలలో కనీసం ఒక్కరోజు సెలవు పెట్టండి. ఆ రోజంతా మీ భాగస్వామిని శృంగారపు తాలూకు ఆనందాన్ని చవిచూపించడంలో నిమగ్నమవ్వండి. ఇటువంటి చిట్కాలు రొమాంటిక్ లైఫ్‌ను రసరమ్యంగా ఆస్వాదించేటట్లు చేస్తాయి.

Story first published: Tuesday, October 26, 2010, 17:29 [IST]
Please Wait while comments are loading...