రతి సంబంధాలు గురించి తమ తమ సెల్ ఫోన్లలో ఎస్ఎమ్ఎస్‌లు చేసే స్త్రీపురుషులూ నేటి సమాజంలో అధికమవుతున్నట్లు వెల్లడైంది. పెళ్లికాక ముందే రతి అనుభవం అనేది తప్పు కాదనే భావన చాలామందిలో పేరుకుపోయింది. నచ్చిన వ్యక్తితో సెక్స్‌కు సంబంధించిన సమాచారాన్ని కలిసి చూడటం తప్పు కానేకాదని వాదిస్తున్నవారి సంఖ్యా కూడా పెరుగుతోంది. కాబట్టి అమ్మాయి - అబ్బాయి కలిసి సెక్స్ బొమ్మలు, సెక్స్ సీన్లు చూడటం మామూలైపోతోంది. వారి మధ్య ఇది అలవాటుగా మారిపోయింది.
నేటి యువత అశ్లీల దృశ్యాలు, సెక్స్ బొమ్మలు చూడటానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తోంది. ఏ కాస్త టైం దొరికినా శృంగారానికి సంబంధించిన కబుర్లే స్నేహితుల మధ్య చోటు చేసుకుంటున్నాయి. అంతేకాదు ఆ దృశ్యాలను చూసిన యువత తమ ప్రియురాళ్లు, భార్యలు తాము చూసిన బ్లూ ఫిల్మ్‌లో యువతుల్లా ప్రవర్తించాలని అంటున్నారు.దీంతో కొందరు స్త్రీలు లైంగిక ఆలోచనలను భాగస్వామితో పంచుకోవడం లేదని తేలింది. అశ్లీల చిత్రాలు, సెక్స్ బొమ్మలను చూసేవారిలో వివాహమైనవారు అధికంగా ఉండటం అశ్చర్యకరం.